Current Affairs Telugu Daily

అభివృద్ది చెందుతున్న నివాస మార్కెట్లో భారత నగరాలు 

*ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ది చెందుతున్న నివాస మార్కెట్లో మన దేశం నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి. 
*దేశ రాజధాని అయిన ఢిల్లీ 9వ స్థానంలో నిలవగా బెంగళూరు 20, ముంబై 28వ స్థానంలో నిలిచాయి.
*గ్లోబల్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్‌ ఫ్రాంక్‌ ప్రైమ్‌ గ్లోబల్‌ సిటీ ఇండెక్స్‌ స్థానిక మార్కెట్లో రియల్టీ ధరల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది.
*2018 రెండో త్రైమాసికంలో ముంబై 30వ స్థానంలో ఉండగా.. ఇప్పుడది రెండు స్థానాలు ఎగబాకి 28కి చేరితే.. బెంగళూరు మాత్రం 15వ స్థానం నుంచి ఐదు స్థానాలు కిందికి దిగజారి.. 20కి  చేరింది. 
*గతేడాది రెండో త్రైమాసికంలో ఢిల్లీ 10వ స్థానంలో నిలిచింది. 
* నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశీర్‌ బైజాల్‌ ---దేశంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలు అఫర్డబుల్, మధ్య స్థాయి గృహాల అభివృద్ధికే పరిమితమయ్యాయి. దీంతో లగ్జరీ ప్రాపర్టీలు సంఘటిత కంపెనీలు, నిధులు సమృద్ధిగా ఉన్న కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి అని పేర్కొన్నారు.
*2019 రెండో త్రైమాసికం నివేదిక ప్రకారం లగ్జరీ రెసిడెన్షియల్‌ మార్కెట్లో మొదటి స్థానంలో రష్యా రాజధాని మాస్కో నిలిచింది. గత ఏడాది కాలంలో ఇక్కడ గృహాల ధరలు 11.1 శాతం వృద్ధి చెందాయి. ఆ తర్వాతి స్థానంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ (10.3 శాతం), తైవాన్‌లోని తైపే (8.9 శాతం) నిలిచాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ అత్యంత క్షీణ స్థితిలో ఉంది. ఇక్కడ లగ్జరీ గృహాల ధరలు 12.9 శాతం పడిపోయాయి.


views: 635



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams