Current Affairs Telugu Daily

యూఎస్ ఎఫ్‌డీఏ తనిఖీల ప్రభావం 

*భారత కంపెనీల ఔషధ తయారీ యూనిట్లలో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ (యూఎస్ ఎఫ్‌డీఏ) తరచూ తనిఖీలు నిర్వహించడం.. లోపాల గుర్తింపు ఔషధ ఎగుమతుల వృద్ధి రేటుపై ప్రభావం చూపుతోంది. 
*భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఫార్మాస్యూటికల్స్‌ జాతీయ కమిటీ చైర్మన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సహ చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ ---  తనిఖీలు, హెచ్చరిక లేఖల కారణంగా అనేక కంపెనీల ఔషధాలకు ఎఫ్‌డీఏ నుంచి రావాల్సిన అనుమతులు నిలిచిపోతున్నాయి.
* సీఐఐ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌ టెక్నాలజీ (ఐఎంటీ) సంయుక్తంగా ఆరోగ్య, ఫార్మా రంగంపై ఏర్పాటు చేసిన సదస్సు లోని అంశాలు-- అనుమతులు నిలిచిపోవడంతో అమెరికా మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ఎగుమతుల వృద్ధి రేటుపై ప్రభావం ఉంటుంది. తి కంపెనీ నాణ్యత, డేటా ఇంటిగ్రిటీ వంటి అంశాల్లో తమదైన వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంది.దేశీయ పరిశ్రమకు ఇది చాలా ముఖ్యమని ఈ సదస్సులో పేర్కొన్నారు.
* అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా రెండు దేశాలు సుంకాలను పెంచాయి. దీంతో అమెరికా, పశ్చిమ దేశాలు చైనా నుంచి ముడి ఔషధాలు, రసాయన ఇంటర్మీడియేట్లను దిగుమతి చేసుకోవడంపై పునరాలోచిస్తున్నాయి. 
*ఇప్పటి వరకూ తక్కువ ధరకు ముడి ఔషధాలను చైనా అందించడం వల్ల ప్రపంచ దేశాలు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.
*ఆమోదయోగ్యమైన ధరలకు అందరికీ ఔషధాలను అందించడం భారత కంపెనీలకు పెద్ద సమస్య  కాదు అని ఈ సదస్సులో పేర్కొన్నారు.


views: 638



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams