Current Affairs Telugu Daily

పాకిస్తాన్ బాలిస్టిక్‌ క్షిపణి 'షహీన్‌-1

*భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్‌ క్షిపణి 'షహీన్‌-1'ను పాక్‌ విజయవంతంగా పరీక్షించింది. 
*ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. 
* భారత్‌లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. గత ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఘజ్నావీ క్షిపణిని పాకిస్తాన్‌ పరీక్షించింది. 
*భారత్‌ కూడా ఇటీవల బ్రహ్మోస్‌ క్షిపణితో పాటు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-2 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.
*త్రివిధ దళాల సన్నద్ధతను పరీక్షించేందుకు పాకిస్తాన్ ఈ ప్రయోగం నిర్వహించింది.


views: 632



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams