Current Affairs Telugu Daily

వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ స్థానం 

*ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో ఈ ఏడాది భారత్ 59వ స్థానానికి దిగజారింది. గతేడాది 53వ స్థానంలో ఉండగా, ఈసారి 6 స్థానాలు పడిపోయింది.
* ప్రతిభావంతులను నిలుపుకోవడం, వారిని ఆకట్టుకోవడంలో భారత్ తీరు బాగోలేదని ఈ ర్యాంకు ద్వారా తెలుస్తుంది. పెట్టుబడి, అభివృద్ధి, సంసిద్ధత ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను ప్రకటించారు. 
* చదువు, ఆరోగ్యం విషయంలోనూ భారత్ ప్రాధాన్యత తగ్గిపోయిందని తాజా నివేదిక ద్వారా తెలుస్తుంది.
*విద్యపై వ్యయం (ప్రతి విద్యార్థికి) తక్కువగా ఉండడం వంటివి ర్యాంకును గణనీయంగా తగ్గించాయని ఐఎండీ బిజినెస్‌ స్కూల్‌ స్విట్జర్లాండ్, సింగపూర్‌ సీనియర్‌ ఎకనామిస్ట్‌ జోస్‌ కాబల్లెరో పేర్కొన్నారు.
* ప్రధానంగా పెట్టుబడులు, అభివృద్ధి, అభ్యర్థన-సంసిద్ధతల ఆధారంగా విడుదలైన ఈ ర్యాంకుల్లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. 
*ఈ అంతర్జాతీయ వార్జిక జాబితాలో మొత్తం 63 దేశాలుండగా, బ్రిక్స్ దేశాల్లో చైనా (42), రష్యా (47), దక్షిణాఫ్రికా (50) లు భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
* జీవన ప్రమాణాలు, చదువు ఖర్చులు, నాణ్యమైన విద్య, కాలుష్యం ,ఆరోగ్య వ్యవస్థ, మహిళా కార్మికులు వంటి అంశాల్లో ప్రతికూలతల వల్ల భారత్ ర్యాంక్ తగ్గింది. 
*టాప్-10లో స్విట్జర్లాండ్ తర్వాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, స్వీడన్, ఆస్ట్రియా, లగ్జెంబర్గ్, నార్వే, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, సింగపూర్ దేశాలున్నాయి.


views: 652



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams