Current Affairs Telugu Daily

పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం 

*ఇస్రో 74వ రాకెట్‌గా పీఎస్ఎల్వీ-సీ47 నవంబర్ 25వ తేదీన ప్రయోగించనుంది .
*అత్యంత ఆధునిక భూ పరిశీలన ఉపగ్రహం కార్టోశాట్‌-3తోపాటు 13 అమెరికా నానో ఉపగ్రహాలను ఈ రాకెట్‌ నిర్ణీత కక్ష్యల్లోకి చేరవేయనుంది.సుమారు 509 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో కార్టోశాట్‌ను ఫిక్స్‌ చేయనున్నారు. 
*పీఎస్ఎల్వీ-సీ47 లో 13 కమర్షియల్ నానోశాటిలైట్‌లు కూడా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది. 
*భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగిస్తున్న ఈ కార్టోశాట్-3 ఉపగ్రహం భారత్ నుంచి కాకుండా అమెరికా నుంచి ప్రయోగం నిర్వహించనుంది. 
*కార్టోశాట్ -3 ఉపగ్రహం మూడో తరంకు చెందిన అడ్వాన్స్‌డ్‌ శాటిలైట్. హై రిజల్యూషన్ ఇమేజింగ్ దీని సొంతం. అంటే ఫోటోలు అత్యంత స్పష్టంగా తీస్తుంది. అంతకుముందు ప్రయోగించిన కార్టోశాట్లలో ఈ స్థాయి రిజల్యూషన్ లేదు.
*ఉగ్రవాదుల కార్యకలాపాలు వారి శిబిరాలను కనుగొనేందుకు కార్టోశాట్-3 ఉపయోగపడుతుంది. మిలటరీ నిఘా కార్యక్రమాలకు ఈ ఉపగ్రహం ఎక్కువగా దోహదపడుతుంది.
*కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వంపులో 509 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెడతారు.
*అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను కూడా నింగిలోకి పంపనున్నారు. ఇవి పూర్తిగా వాణిజ్య అవసరాలకోసం రూపొందించిన శాటిలైట్లు. 
*స్పేస్ డిపార్ట్‌మెంట్ కింద కొత్తగా ఏర్పడిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ నానో శాటిలైట్లను రూపొందించింది.


views: 623



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams