Current Affairs Telugu Daily

వేతన కోడ్‌-2019 డ్రాఫ్ట్‌

* కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్మికుల పని గంటలను 9 గంటలకు పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. 
*దీని వల్ల కార్మికులు చేస్తున్న 8 గంటల పని ఇక నుండి 9 గంటలుగా మారనుంది. 
* పలు ఫ్యాక్టరీలు ఇప్పటికే కార్మికులతో 9 గంటల పని చేయిస్తున్నాయి.ఇదే నిబంధనలను అన్ని సంస్థలకు వర్తింపజేయాలని ప్రయత్నం జరుగుతోంది. ఈ విధానం కనుక అమల్లోకి వస్తే ఆ పని గంటలు పది గంటలు కూడా కావచ్చూ.
*వారంలో ఒక రోజు సెలవు దినంతో రోజుకు 9 పని గంటలు చేయాలనే ప్రతిపాదనను భారత ప్రభుత్వం డ్రాఫ్ట్ వేజ్ రూల్స్‌లో తీసుకొచ్చింది.
*ఒక కార్మికుడికి కనీస వేతనం ఎంత ఉండాలనే విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు.
*భవిష్యత్తులో వేతనాలు నిర్ణయించడానికి ఆరు ప్రమాణాలను సూచించారు.
*తొలిసారిగా 1957 లో లెక్కించిన కనీస వేతనం విధానమే ఇప్పటికీ అమలు చేస్తున్నారు.
*కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అంతర్గత ప్యానెల్ --జూలై 2018 నుంచి రోజుకు రూ. 375 అనే మొత్తం జాతీయ కనీసీ వేతనంగా ఉండాలి.కనీస నెల జీతం రూ. 9,750కి అదనంగా హౌసింగ్ అలవెన్స్ పేరిట రూ. 1,430 కూడా నగరంలో ఉండే కార్మికులకు చెల్లించాలి అని పేర్కొంది.
*మూడు రకాల వేతనాలు ఉన్నాయి.వాటిలో ఒకటి కనీస వేతనం, మంచి వేతనం, జీవించే వేతనం ఉన్నాయి. 

*8 లేదా 9 గంటల పని గంటలకు బదులు 6 గంటల పని దినాలనే భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) అనుబంధమైన ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ సీకే సాజి నారాయణన్ డిమాండ్ చేస్తున్నారు.
*కనీస వేతనం మూడు భౌగోళిక వర్గీకరణలను బట్టి నిర్ణయించబడుతుందని డ్రాఫ్ట్ రూల్ తెలిపింది. 40 లక్షలు లేదా అంతకంటే జనాభా ఎక్కువ ఉన్న మెట్రో నగరాలు, 10 లక్షల నుంచి 40 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాలను నాన్ మెట్రో నగరాలుగా, మిగితా ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా వర్గీకరించారు. 
*నగరాల్లో జీవించే ప్రజల కనీస వేతనంలో 10శాతం అద్దె ఉంటుందని డ్రాఫ్ట్ రూల్ చెబుతోంది. అయితే, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్లేవారి సంఖ్య మనదేశంలో రోజు రోజుకు చాలా పెరిగిపోతోంది. ఇంటి అద్దె 10శాతం, ఆహారం, బట్టల ఖర్చులు ఈ రోజుల్లో చాలా పెరిగిపోయాయి.
*పెట్రోల్, డీజిల్, విద్యుత్, ఇతర ఖర్చులు కనీస వేతనంలో 20శాతం ఉంటాయని అంచనా వేస్తోంది డ్రాప్ట్ రూల్. రోజుకి 2700 కేలరీస్, ఒక కుటుంబానికి ఏడాదికి 66 మీటర్స్ బట్టలను డ్రాఫ్ట్ర పరిగణలోకి తీసుకుంటోంది.
*వర్కర్, భాగస్వామి, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం ఆరుగురిని యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని  కొన్ని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.


views: 610



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams