RCEPపై 19వ విడత చర్చ లు
ఆసియాన్‌ దేశాలు, వాటితో స్వేచ్భా వాణిజ్య ఒప్పందాలున్న దేశాలు మరింతగా స్వేచ్ఛా వాణిజ్యానికి బాటలు వేయడానికి హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(RCEP) ఒప్పందానికి సంబంధించిన 19వ విడత చర్చలకు భారత్‌ అతిథ్యం ఇస్తోంది. ఈ చర్చలు 2017 జులై 17 నుంచి 28 తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్నాయి. 
10 ఆసియన్‌ దేశాలు-బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌, లావోస్‌, వియత్నం.. వాటితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలున్న- భారత్‌, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు చర్చలకు వస్తున్నాయి. RCEPలో భాగంగా దాదాపు 85-90 శాతం వస్తువులపై భారత్‌ సుంకాలను ఎత్తివేయాలని కొన్ని ఇతర సభ్య దేశాలు కోరుతున్నాయి. RCEPపై 2012, నవంబరులో చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ 16 దేశాల వాటా నాలుగో వంతుకు పైగా ఉంది.
RCEP-Regional Comprehensive Economic Partnership  

views: 828

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams