Current Affairs Telugu Daily

కాలాపానీ వివాదం 

*నేపాల్, ఇండియా, టిబెట్ సమీపంలో మూడు ప్రాంతాల ' జంక్షన్ ' లో ఉన్న ప్రాంతం ' కాలాపాని '.
*ఇక్కడి నుంచి భారత్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించాలని ఆ దేశ ప్రధాని కె. పి. ఓలి డిమాండ్ చేశారు. 
*కొద్దిరోజుల క్రితం భారత హోంశాఖ కార్యాలయం విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో కాలాపానిని భారత భూభాగంలో చేర్చడంపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.
*ఈ క్రమంలోనే కాలాపాని వద్ద మోహరించి ఉన్న భారత సైన్యం వెంటనే అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ డిమాండ్ చేశారు. 
*పశ్చిమ నేపాల్‌కు చివరన కాలాపాని ప్రాంతం ఉంటుంది. నేపాల్ అభ్యతరం తెలిపినప్పటికీ భారత ప్రభుత్వం స్పందించలేదు.
* మ్యాపులో ఉన్నది ఖచ్చితత్వంతో కూడిన భారత సౌర్వభౌమ భూభాగమని భారత అధికారులు అంటున్నారు.
* అప్పుడు ఎలా ఉన్నిందో కొత్త మ్యాపులో కూడా నేపాల్ సరిహద్దు అలానే ఉందని భారత  అధికారులు అంటున్నారు.
* ప్రధాని కేపీ ఓలీ -- తమ భూభాగమైన కాలాపాని నుంచి భారత్ తన సైన్యంను ఉపసంహరించుకున్న తర్వాతే చర్చలు జరుపుతాం అన్ని పేర్కొన్నారు.
*జమ్మూకశ్మీర్‌ మరియు లడఖ్‌లు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత భారత మ్యాపును రీడిజైన్ చేసింది కేంద్ర హోంశాఖ.ఈ మ్యాప్‌లో ఉత్తరాఖండ్, నేపాల్ మధ్య ఉన్న కాలాపానీ, లిపు లేఖ్ ప్రాంతాలు భారత్‌లో ఉన్నట్టు చూపించారు.
*పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను జమ్మూకశ్మీర్‌లోకి చేర్చగా.. గిల్గిట్-బాల్టిస్తాన్‌ను లడాఖ్‌లో చేర్చారు. 
*కొత్తగా గీసిన మ్యాప్‌లో నేపాల్ భారత్ సరిహద్దులను మార్చలేదని భారత్  స్పష్టం చేసింది.
* ప్రతి ఏటా భారత ప్రభుత్వం మ్యాప్ విడుదల చేస్తుంది.018, లేదంటే అంతకు ముందు ఉన్న  మ్యాప్ లలో కాలాపానీ భారత్‌లోనే కనిపిస్తుంది అని భారత్ అంటుంది.
*దేశంలో కొత్త రాష్ట్రాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినపుడు వాటిని మ్యాప్‌లో చూపించాల్సి ఉంటుంది.
*కాలాపానీ ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో ఉంది. దీని విస్తీర్ణం 35 చదరపు కి.మీ.లు. ఇక్కడ ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు దళం సిబ్బంది మోహరించి ఉన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం నేపాల్‌తో 80.5 కి.మీ.లు, చైనాతో 344 కి.మీ.ల పొడవున సరిహద్దు పంచుకుంటోంది.కాలీ నది పుట్టే ప్రాంతమే కాలాపానీ. భారత్ విడుదల చేసిన తాజా మ్యాప్‌లో ఈ నదిని కూడా చూపించారు.
1816లో ఈస్ట్ ఇండియాతో చేసుకున్న సుగౌలీ ఒప్పందం ప్రకారం కాలాపానీ, లిపు లేఖ్‌ తమకు చెందుతాయని నేపాల్ అంటోంది.
*1962లో చైనాతో భారత్ యుద్ధం చేసినప్పుడు కాలాపానీని ఓ స్థావరంగా చేసుకుంది.
*ఈ యుద్ధానికి ముందు 1961లో కాలాపానీలో నేపాల్ జనాభా లెక్కలు చేపట్టినప్పుడు భారత్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని నేపాల్ అంటుంది.
*కాలాపానీ భారత్‌లో ఉండటం సుగౌలీ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అవుతుందని నేపాల్ అంటుంది.
*చైనాతో యుద్ధం తర్వాత భారత్.. కాలాపానీ మినహా, నేపాల్ ఉత్తర బెల్టులో ఉన్న తమ సరిహద్దు పోస్టులన్నీ తొలగించింది. 


views: 708Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams