Current Affairs Telugu Daily

అమెరికా విదేశీ విద్యార్థుల్లో రెండో స్థానంలో భారత్ 

ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఎక్స్ఛేంజ్‌ నివేదిక --అమెరికాలో చదువుకుంటున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది.
* నివేదిక ప్రకారం రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వలస వెళ్లారు.
* ప్రపంచంలో అమెరికాకు వలస వెళుతున్న దేశాలలో (2018-2019) చైనా 3,69,548 మంది విద్యార్థులతో అగ్రస్థానంలో ఉండగా, భారత్‌ 2,02,014మంది విద్యార్థులతో రెండో స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో దక్షిణ కొరియా(52,250), సౌదీ అరేబియా(37,080), కెనడా(26,122) దేశాల విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు.
*2018 లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ విద్యార్థులు 44.7 బిలియన్ డాలర్లు చెల్లించారు.గత సంవత్సరంతో పోలిస్తే 5.5 శాతం పెరిగింది.
*21.1శాతం విద్యార్థులు ఇంజనీరింగ్‌ను ఎన్నుకున్నారు.51.6శాతం విద్యార్థులు  సైన్స్‌–టెక్నాలజీ–ఇంజనీరింగ్‌–గణితం(స్టెమ్‌) కోర్సులు చదివారు.
*అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థులలో భారత్‌, చైనా దేశాల విద్యార్థులే 50శాతం వరకు ఉన్నారు.
*ఈ నివేదిక ప్రకారం,గత పదేళ్లుగా అమెరికాకు వలస వెళుతున్న విదేశీయులలో చైనా, భారత్  విద్యార్థులు మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు.
*అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కఠిన వీసా నిబంధనలను అమలు చేస్తున్నప్పటికి అత్యధిక భారతీయ విద్యార్థులు అమెరికావైపు ఆసక్తి చూపుతున్నారు.


views: 658



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams