Event-Date: | 18-Nov-2019 |
Level: | National |
Topic: | Law and order, Defence |
ఇండో అమెరికన్ త్రివిధ దళాల విన్యాసాలు
*ఇండో అమెరికన్ త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరంలో జరగనున్నాయి. నవంబర్ 13న విశాఖలో సముద్రతీరంలో భారత్- అమెరికా దేశాల త్రివిధదళాల 'టైగర్ ట్రయంప్' కార్యక్రమం ప్రారంభమైంది.
* నవంబర్ 18వ తేదీ ) నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాలకు సైనిక, నౌకా దళ సిబ్బంది బీచ్ లో భారీగా ఏర్పాట్లు చేశారు.
*కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేట అనే గ్రామ పరిధిలో ఉన్న బీచ్ లో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు.
*జాతీయ విపత్తు వాటిల్లినప్పుడు రోడ్లు మూసుకుపోతే ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనే దానిపై సుమారు 150 మంది నావి బృందం విన్యాసాలను ప్రదర్శిస్తారు.
*భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించడంలో భాగంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి.
*విశాఖ హార్బర్ పరిధిలో నవంబర్ 16 వరకు విన్యాసాలు జరిగాయి.ఈ విన్యాసాలు భారత నావికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్, ఐఎన్ఎస్ సంధాయక్ భారత్ ఆర్మీ లోని 7 గాడ్స్ యూనిట్ పాల్గొంటున్నాయి. ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూపర్ హెర్యులస్ విమానం ఎమ్ఐ 17 రవాణా హెలికాప్టర్ లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి.
*విశాఖలో టైగర్ ట్రయంప్ విన్యాసాల ప్రారంభోత్సవానికి భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ జలశ్వ వేదికైంది.
* విశాఖ నుంచి కాకినాడకు రానున్న అమెరికాకు చెందిన జర్మన్టౌన్ యుద్ధ విమానంలో నవంబర్ 21న టైగర్ ట్రయంప్ ముగింపు కార్యక్రమం జరగనుంది. తూర్పు నౌకాదళ చీఫ్, వైఎస్ అడ్మిరల్ గోర్మడే, రియల్ అడ్మిరల్ సూరజ్ భేరీ, భారత్లో యూఎస్ అంబాసిడర్ కెన్నత్ జస్టర్, కమాండింగ్ అధికారి క్రిస్టోఫర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.