Current Affairs Telugu Daily

ఆస్తులకు ఆధార్ లింక్

*స్థిరాస్తి లావాదేవీల్లో పారదర్శకత - చట్టం రూపకల్పనకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
* నల్లధనాన్ని, హవాలా లావాదేవీలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
*దేశంలో బినామీ ఆస్తుల లావాదేవీలను అడ్డుకునేందుకు ఓ కొత్త చట్టాన్ని కేంద్రం తీసుకురానుంది.
* దీనివల్ల  స్థిరాస్తి లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుంది.
* భూములు,ఇళ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.
* చట్టం అమలులోకి వస్తే చాలామంది తమ అక్రమాస్తులను వదిలించుకొనేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నందున ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది.
*మహారాష్ట్రలోని నారెడ్‌కో సంస్థ అధ్యక్షుడు రాజన్‌ బందేల్కర్‌--ఆధార్‌తో స్థిరాస్తి యాజమాన్యాన్ని అనుసంధానం చేస్తే నల్లధనం బయటకు వస్తుంది, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మోసాలు  తగ్గుతాయి.
*  ఆస్తి లావాదేవీలు సులభతరం కావడంతోపాటు కొనుగోళ్లకు రుణాలు కూడా త్వరగా మంజూరయ్యే అవకాశం ఉంది.
* పారదర్శకత పెరుగడం వల్ల గృహ రుణాలు, ఆస్తి లావాదేవీలు, అమ్మకాలు లేదా కొనుగోలు తదితర ప్రక్రియలు మరింత సులభతరం అవుతాయి.
*ఒకే ఇంటిని లేదా స్థలాన్ని ఇద్దరు లేదా ముగ్గురికి అమ్మే బ్రోకర్లను అరికట్టవచ్చు.
* ప్రభుత్వ నిర్ణయం గృహ నిర్మాణ రంగంపై సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.


views: 636



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams