Current Affairs Telugu Daily

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - ఆంధ్ర ప్రదేశ్ 

*ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.
*నవంబర్ 14 నుంచి 27 వరకు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 39వ 'ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్' (ఐఐటీఎఫ్-2019)లో భాగంగా రాష్ట్రానికి ఈ అరుదైన గుర్తింపు లభించింది.  
*ఏటా జరిగే ఈ ట్రేడ్ ఫెయిర్‌కు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరవుతారు. ఈ ఏడాది 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంశాన్ని ట్రేడ్ ఫెయిర్ ఎంచుకుంది. సమకాలీన సాంకేతికత ప్రామాణికంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ట్రేడ్ ఫెయిర్‌లో ఆవిష్కరించింది. 
* వైఎస్సార్ నవోదయం, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)ల ఏర్పాటులో తీసుకువస్తున్న మార్పులు, కీలక రంగాలైన టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ వాహనాలు, రసాయనాలు, పెట్రో కెమికల్ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, విశాఖ- చెన్నై, చెన్నై- బెంగుళూరు ఇండస్ట్రిల్ కారిడార్లు, విమాన, నౌకా శ్రయాల అభివృద్ధికి ప్రభుత్వ విధానాల వల్ల  ఈ గుర్తింపు లభించింది.


views: 668



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams