Current Affairs Telugu Daily

 ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బిల్‌గేట్స్‌ 

*ప్రపంచ కుబేరుల్లో బిల్‌గేట్స్‌ మరో సారి తన అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ఈ పీఠాన్ని అధిరోహించారు.
*మైక్రోసాఫ్ట్‌కు 10 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.70,000 కోట్లు) క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కాంట్రాక్టు రావడం వల్ల బిల్‌గేట్స్‌ తిరిగి మొదటి స్థానానికి చేరారు.
*అమెజాన్‌కు కాకుండా..ఈ కాంట్రాక్టును మైక్రోసాఫ్ట్‌కు ఇస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ అక్టోబరు 25న ప్రకటించింది. 
* అప్పటి నుంచి ఇప్పటిదాకా మైక్రోసాఫ్ట్‌ షేర్లు 4 శాతం మేర పెరిగాయి. 
*బిల్ గేట్స్ సంపద 110 బిలియన్‌ డాలర్లకు(సుమారు రూ.7.7 లక్షల కోట్లు) చేరింది.
*అమెజాన్‌ షేరు 2% తగ్గడంతో బెజోస్‌ నికర సంపద 108.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ప్రతి రోజు ప్రపంచంలోని 500 మంది సంపన్నుల సంపదను సూచించే ఈ సూచీ ప్రకారం.. ఐరోపాలోనే అత్యంత సంపన్నుడైన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ మొత్తం మీద మూడో స్థానంలో నిలిచారు. ఈయన సంపద 102.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
** ఈ ఏడాది మైక్రోసాఫ్ట్‌ షేరు 48 శాతం మేర రాణించింది. దీంతో గేట్స్‌కున్న 1 శాతం వాటా విలువ బాగా పెరిగింది. మిగతా ఆయన సంపద వాటా విక్రయాలు, కుటుంబ కార్యాలయం కొన్నేళ్లుగా పెడుతున్న పెట్టుబడుల ద్వారా వచ్చింది.
*అయితే బెజోస్‌ సంపద గేట్స్‌ కంటే చాలా ఎక్కువే ఉండాల్సింది. భార్య మాక్‌కెంజీకి జనవరిలో విడాకులు ఇవ్వడంతో అమెజాన్‌లో నాలుగోవంతు వాటాను ఆమెకు కట్టబెట్టాల్సి వచ్చింది.
*ఎందుకంటే 1994 నుంచి ఇప్పటిదాకా బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు ఈయన 35 బిలియన్‌ డాలర్లకు పైగా దానం చేశారు.


views: 650



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams