Current Affairs Telugu Daily

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

*  పార్లమెంటు శీతాకాల సమావేశాలు    నవంబర్ 18వ తేదీన ప్రా రంభమయ్యాయి. లోకసభను స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, రాజ్యసభను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 
*ఈ పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతిపక్షాలు మాత్రం జమ్మూకశ్మీర్ పరిస్థితులు, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం తదితర అంశాలను లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి.
*ఈ సమావేశాలు డిసెంబర్‌ 13 వరకు కొనసాగున్నాయి. 
* కీలక బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది.
* ఈ సమావేశాలలో మొత్తం 35 బిల్లులు చర్చకు రానున్నాయి. అందులో చిట్ ఫండ్స్ (సవరణ) బిల్లు, 2019, పౌరసత్వం (సవరణ) బిల్లు 2019, మరియు రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (సవరణ) బిల్లు 2019, లాంటి కీలక బిల్లులను ఈ సెషన్‌లో ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తుంది. అలాగే, పార్లమెంటు మొదటి సెషన్‌లో ట్రిపుల్ తలాక్ మరియు యుఎపిఎ చట్టానికి జరిమానా విధించే చట్టాన్ని రూపొందించడం సహా ముఖ్యమైన బిల్లులపై సభలో చర్చలు జరగనున్నాయి.
*ఆర్డినెన్స్ రూపంలో ఉన్న ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం, టాక్సేషన్ ఆఫ్ లా బిల్లులను ఈ శీతాకాల సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది.
పాస్ చేయించాలని భావిస్తున్న ముఖ్యమైన బిల్లులు ----
**నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ డిజైన్ (అమెండ్‌మెంట్ )బిల్లు, 2019
* చిట్‌ఫండ్ (అమెండ్‌మెంట్)బిల్లు 2019
*సరోగసీ రెగ్యులేషన్ బిల్లు 2019
* అంతరాష్ట్ర నదీ జలాలా వివాదం (అమెండ్‌మెంట్)బిల్లు 2019
* డ్యామ్ సేఫ్టీ బిల్లు
*ట్రాన్స్‌జెండర్ పర్సన్ (హక్కుల పరిరక్షణ)బిల్లు, 2019
* జలియన్‌వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ (అమెండ్‌మెంట్)బిల్లు 2019
*కాన్స్‌టిట్యూషన్ (షెడ్యూల్ తెగల)ఆర్డర్ (అమెండ్‌మెంట్)బిల్లు 2019
* కాన్స్‌టిట్యూషన్ (షెడ్యూల్ తెగల)ఆర్డర్ (రెండవ అమెండ్‌మెంట్)బిల్లు 2019
*ప్రాధాన్యత కలిగిన కొత్త బిల్లుల ప్రవేశపెట్టడం పాస్ చేయించడం-----
* పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్లు 2019
* ఇన్‌సాల్వెన్సీ & బ్యాంక్‌రప్టసీ (రెండవ) అమెండ్‌మెంట్ బిల్లు 2019
* ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ బిల్లు, 2019
* మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (అమెండ్‌మెంట్)బిల్లు 2019
* సిటిజెన్ షిప్ (అమెండ్‌మెంట్)బిల్లు 2019
* పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2019
* ఆర్మ్స్ యాక్డ్ (అమెండ్‌మెంట్)బిల్లు 2019
* రాజ్యసభ 250వ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.67 సంవత్సరాల్లో 3,817 బిల్లులను రాజ్యసభ ఆమోదించింది.
*ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉభయసభలు ఉమ్మడిగా సమావేశం కానున్నాయి.


views: 593



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams