Current Affairs Telugu Daily

మూడు దేశాల సందర్శనకు  ఐసీజీఎస్ శౌర్య

*భారత తీర రక్షణ దళానికి చెందిన ఆఫ్ షోర్ పెట్రోలింగ్ ఐసీజీఎస్ శౌర్య గస్తీ నౌక మూడు దేశాల సందర్శనకు బయలుదేరింది. 
*గుడ్ విల్ విజిట్‌లో భాగంగా జకార్తా(ఇండోనేషియా), డ్రావిన్(ఆస్ట్రేలియా), సింగపూర్ దేశాల్లో తీర గస్తీ నౌక నవంబర్  12న జకార్తాకు చేరి, డిసెంబర్ 8 వరకూ ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో వివిధ కార్యకలాపాల్లో పాలుపంచుకోనుంది. 
*ఈ సందర్శనలో భాగంగా నవంబర్ 17 నుంచి 20 వరకూ జకార్తాలోనే ఉంటుంది. 
*సందర్శనలో భాగంగా మారీటైం లా అమలు అంశంలో ఇరు దేశాల మధ్య సమన్వయం, సహకారంపై ఇరు దేశాల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతారు. సముద్రంలో గాలింపు, పునరావాసం, మారీటైం కాలుష్యం, సముద్రంలో జరిగే చోరీలు తదితర విషయాల్లో పరస్పర సహకారం వంటి అంశాలు చర్చిస్తారు.
* ఐసీజీఎస్ శౌర్యకు కోస్ట్‌గార్డ్ డీఐజీ జ్యోతిందర్ సింగ్ సారథ్యం వహిస్తున్నారు.


views: 596



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams