Current Affairs Telugu Daily

 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే

*సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నవంబర్ 18వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.
* రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డేతో ప్రమాణ స్వీకారం చేయించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నిన్న పదవీవిరమణ చేయడంతో ఆయన వారసుడిగా 63 ఏళ్ల శరద్ అరవింద్ బోబ్డే ప్రమాణ స్వీకారం చేశారు.
*2021 ఏప్రిల్ 23 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే సేవలు అందించనున్నారు. 
*సుప్రీం కోర్టులో ఎంతోమంది జడ్జిలు ఉన్నప్పటికీ బాబ్డేను తన వారసుడిగా చేయమని చెప్పారు మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ రంజన్ గొగోయ్.
*రంజన్ గొగోయ్ తర్వాత బాబ్డేనే సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి.
*1956 ఏప్రిల్ 24న నాగపూర్‌లో జన్మించిన జస్టిస్ బాబ్డే, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నాగపూర్ యూనివర్శిటీలో లా డిగ్రీ చదివారు. అనంతరం 1978లో బాబ్డే మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో చేరారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొంది 2000 మార్చి 29న జడ్జి అయ్యారు. బాంబే హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు.
*2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయ్యారు. ఆతర్వాత ఈరోజు సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ, యూయూ లలిత్, డీవై చంద్రచూడ్‌లు వరసగా ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు.
*చీఫ్ జస్టిస్ బోబ్డే పలు కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనంలో ఉన్నారు. ముఖ్యంగా అయోధ్య భూవివాదం కేసులో అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. 2017లో ప్రైవసీ అనేది ప్రాథమిక సూత్రాల కిందకు వస్తుందని చెప్పారు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే. అదే సమయంలో ప్రభుత్వ సేవలు అందాలంటే భారతీయ పౌరుడికి ఆదార్ తప్పనిసరి అని 2015లో తీర్పు చెప్పారు ఎస్‌ఏ బోబ్డే.


views: 609Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams