Current Affairs Telugu Daily

దేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక

*రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది. 
*దేశవ్యాప్తంగా 50 పట్టణాలను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది.
*దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలను అధ్యయనం చేసిన రవాణా మంత్రిత్వ శాఖ స్థానాల నివేదిక రూపంలో పొందుపరిచింది. 
* ప్రమాదాలలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణ కూడా ఎనిమిదవ స్థానంలో ఉంది.
*  ప్రమాదాల సంఖ్య, వాటిల్లో మృతుల సంఖ్య ప్రాతిపదికన కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఈ నివేదికను విడుదల చేసింది.
*దేశంలోని నగరాల్లో కాలినడకన వెళ్లే పాదచారులకు కూడా భద్రత లేదని కేంద్ర రవాణ మంత్రిత్వశాఖ నివేదికలో వెల్లడైంది. దేశంలో 2014, 2018 సంవత్సరాల్లో రోజుకు సగటున 62 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని కేంద్ర నివేదికలో తేలింది. నగరాల్లో పాదచారులు రోడ్డు దాటుతూ ప్రమాదాల పాలవుతున్నారు. 
*2014లో దేశంలో రోజుకు 34 మంది పాదచారులు రోడ్డు దాటుతూ మరణించగా, 2018 నాటికి వీరి సంఖ్య 62 మందికి పెరిగింది. 2014వ సంవత్సరంలో దేశంలో 12,330 మంది పాదచారులు రోడ్డు దాటుతూ వాహనాల కింద పడి మరణించారు. 2015లో 13,894మంది, 2016లో 15,746 మంది, 2017లో 20,457 మంది, 2018లో 22,656 మంది పాదచారులు మరణించారని కేంద్ర రవాణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
* ఈ నివేదిక ప్రకారం,2018 హైదరాబాద్ లో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
*. ఈ ప్రమాదాలు సైతం అత్యధికంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయంలో చోటుచేసుకున్నాయని గుర్తించింది.
*రాష్ట్రంలో 2018లో మొత్తం 4,485 ప్రమాదాలు సంభవించాయి.
* ప్రస్తుతం అమలులో ఉన్న మో టారు వాహన చట్టం 1988 నాటిది. ఆ కాలంలో ఉన్న వాహనాలకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించారు. ఇదిలావుండగా అప్ప ట్లో దేశ వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో 49వేల పైచిలుకు ఉండగా అది కాస్త నేడు 1.50లక్షలకు చేరుకుంది. 
*రాష్ట్రానికి నలువైపులా ఉన్న జాతీయ రహదారుల్లో బ్లాక్ స్పాట్స్, డార్క్ స్పా ట్స్‌లను గుర్తించి యూటర్న్, అటవీ ప్రాంతాలలో డ్యాష్ బోర్డులు, సైన్ బోర్డుల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖత చూపుతోంది.
* రోడ్డు ప్ర మాదాల నివారణ, భద్రత విషయంలో కట్టుదిట్టమై న చర్యల్లో భాగంగా వాహనాలకు నిర్ధిష్ట వేగాన్ని నిర్ణయించడం, ఆపై వేగ నియంత్రణ సూచికలను రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసేందుకు అధికారులు పనిచేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది.
*రోడ్డు ప్రమాదాల్లో 15 శాతం మంది పాదచారులు, 2.4 శాతం మంది సైక్లిస్టులు మరణిస్తున్నారని వెల్లడైంది. 2018వ సంవత్సరంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 2,618 మంది పాదచారులు మరణించడంతో దేశంలోనే ఆ రాష్ట్రం మృతుల సంఖ్యలో ముందుంది. మహారాష్ట్రలో 2,515 మంది, ఆంధ్రప్రదేశ్ లో 1,569 మంది ఢిల్లీలో 420 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.
*రోడ్డుపై జీబ్రా క్రాసింగ్ ల వద్ద రోడ్డు దాటేటపుడు కూడా వాహనాల కింద పడి పాదచారులు మరణిస్తున్నారని కేంద్ర నివేదిక తేల్చి చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో 54 శాతం మంది పాదచారులు, సైక్లిస్టులు, ద్విచక్రవాహనచోదకులు మరణిస్తున్నారని కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. 
తెలంగాణ----


views: 626



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams