Current Affairs Telugu Daily

ఇంద్రానూయికి అమెరికా నేషనల్ పోట్రెయిట్ గాలరీలో స్థానం 

*ఇండియన్-అమెరికన్, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయికి అరుదైన గౌరవం దక్కింది. 

* అమెరికా నేషనల్ పోట్రెయిట్ గాలరీలో ఆమెకు స్థానం దక్కింది. ఆమెతో పాటు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, ప్రాన్సెస్ అర్నాల్డ్ సహా మరికొంతమందికి ఈ గ్యాలరీలో చోటు దక్కింది. 
*ఇంద్రానూయీ ప్రసంగంలోని అంశాలు- మహిళలు తమను తాము సెకండ్ గ్రేడ్ పౌరులుగా పరిగణించుకోవద్దని సూచించారు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. కష్టపడి పని చేస్తే పుట్టిన ప్రాంతం, సంస్కృతితో సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయన్నారు. తనకు ఈ గౌరవం ఇవ్వడం ద్వారా.. మహిళలు తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అమెరికా గొప్ప దేశమన్న సందేశం ఇచ్చారన్నారు. 
*అమెరికా నిర్మాణం, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారికి నేషనల్ పోట్రెయిట్ గ్యాలరీలో స్థానం కల్పిస్తారు. దీనిని 1962లో స్థాపించారు. దశాబ్దాలుగా పేయింటింగ్స్, ప్రింట్స్, డ్రాయింగ్, చెక్కినవే కాకుండా ఇటీవలి డిజిటల్ వరకు 23,000కు పైగా ఐటమ్స్ ఈ గ్యాలరీలో ఉన్నాయి. ఈ గ్యాలరీలోకి ప్రతి ఏడాది 150 నుంచి 200 పోట్రెయిట్స్ చేరుతున్నాయి.


views: 582



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams