Current Affairs Telugu Daily

జాతీయ పత్రికా దినోత్సవం 

*భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16 వ తేదిన జాతీయ పత్రికాదినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. గతంలో 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. 
*అప్పటి నుంచి ఇప్పటి వరుకు ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా(నేషనల్‌ ప్రెస్‌ డే) దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 
*భారత రాజ్యాంగం ప్రసాదిం చిన పౌరహక్కులలో భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన పత్రికా స్వేచ్ఛ ఇమిడి ఉంది. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రతీ సంవ త్సరం నవంబరు 16న జాతీయ ప్రెస్‌ దినంగా స్వతంత్ర, పక్షపాత రహితమైన, నీతివంతమైన పత్రికా రంగానికి అంకితం కావలసినదిగా భారతీయ ప్రెస్‌కు పిలుపు ఇస్తోంది. 
*స్వాతంత్య్రానతరం, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌లుగా వ్యవహరించిన రాజగోపాల అయ్యంగార్‌, గ్రోవర్‌, సేన్‌, సర్కారియా, సావంత్‌, మార్కండేయ కట్జూ వంటి మేధావ్ఞలు ఎందరో న్యాయదీక్షా దక్షలతో మార్గదర్శకత్వం అందిస్తున్నారు.
*1989-1995లలో పిసిఐ ఛైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్‌ ఆర్‌.ఎస్‌. సర్కారియా ప్రెస్‌ కౌన్సిల్‌ నిర్దేశించిన 23 నిబంధనలు, పరిశోధనాత్మక జర్నలిజం అవలంబించవలసిన 7 నిబంధనలను మరింత తేటతెల్లం చేశారు. 2012లో పిసిఐ ఛైర్మన్‌గా జస్టిస్‌ మార్కండేయ కట్జూ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ రెండింటినీ కలిపిమీడియా కౌన్సిల్‌గా ఒకే గొడుగు కింద తేవడానికి వీలుగా 1978 ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం మార్పు చేయాలని కోరుతూ ప్రతిపాదించారు. 


views: 669



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams