Current Affairs Telugu Daily

వాణిజ్యలోటు 94.72 బిలియన్‌ డాలర్లు

*భారత్‌ ఎగుమతుల్లో వరుసగా మూడవనెలా ప్రతికూలతే నమోదయ్యింది.
*అక్టోబర్‌లో అసలు వృద్ధిలేకపోగా -1.11 క్షీణరేటు నమోదయ్యింది. అంటే 2018 అక్టోబర్‌తో పోల్చిన 2019 అక్టోబర్‌లో ఎగుమతుల విలువ -1.11 శాతం తగ్గి, 26.38 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.
*పెట్రోలియం (-14.6 శాతం), తివాచీ (-17 శాతం), తోలు ఉత్పత్తులు (-7.6 శాతం), బియ్యం (-29.5 శాతం), తేయాకు (-6.16 శాతం)వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి.
*ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 18 క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. భారత్‌ ఎగుమతులు ఆగస్టులో -6 శాతం క్షీణతను నమోదుచేసుకుంటే, సెప్టెంబర్ లో ఈ క్షీణత రేటు -6.57 శాతంగా ఉంది.
*దిగుమతులు కూడా 16.31 శాతం పడిపోయాయి. విలువ రూపంలో 37.39 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు- దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో ఈ పరిమాణం 18 బిలియన్‌ డాలర్లు.
*- పసిడి దిగుమతులు 5 శాతం పడిపోయి 1.84 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
- చమురు దిగుమతులు అక్టోబర్‌లో -31.74 శాతం క్షీణించి 9.63 బిలియన్‌ డాలర్లుగా నమోదయితే, చమురేతర దిగుమతులు -9.18 శాతం పడిపోయి 27.76 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకూ చూస్తే, ఎగుమతులు 2.21 శాతం తగ్గి 185.95 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు - 8.37 శాతం క్షీణించి 280.67 బిలియన్‌ డాలర్లకు జారాయి. వెరసి వాణిజ్యలోటు 94.72 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 
*సేవల ఎగుమతుల విలువ 17.22 బిలియన్‌ డాలర్లు ఉంటే, దిగుమతుల విలువ 10.92 బిలియన్‌ డాలర్లుగా నమోదయింది. 
*భారత ఎగుమతి సంస్థల సమాఖ్య చీఫ్‌ శరద్‌ కుమార్‌ సరాఫ్‌


views: 650



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams