Event-Date: | 16-Nov-2019 |
Level: | National |
Topic: | Economic issues |
జాతీయ గణాంక సంస్థ వినిమయ వ్యయంపై సర్వే
*చేతుల్లో డబ్బులు లేకపోవడంతో రోజువారీ నిత్యావసర, ఇతర వస్తువులపై వారు చేసే ఖర్చు తగ్గిపోతోంది.
* 2017-18లో ప్రజల వినిమయ వ్యయం నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్టస్థాయికి పడిపోయింది.
* గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన డిమాండ్ కారణంగానే ఇటువంటి పరిస్థితి వచ్చిందని జాతీయ గణాంక సంస్థ (ఎన్ఎస్ఒ) తాజాగా వినిమయ వ్యయంపై చేసిన సర్వే ద్వారా తెలిసింది.
*భారత్లో కుటుంబ వినిమయ వ్యయానికి సంబంధించి ఎన్ఎస్ఒ సర్వేలోని పలు గణాంకాలను పరిశీలిస్తే.. ఒక నెలలో ఒక వ్యక్తి చేస్తున్న సరాసరి తలసరి ఖర్చు 3.7 శాతం పడిపోయింది. 2011-12లో రూ.1,501గా ఉన్న వ్యక్తిగత సరాసరి వినిమయ వ్యయం 2017-18 సంవత్సరానికి రూ.1,446కు పడిపోయింది. 2009-10 ఆధార (బేస్) సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంకెలను గణించారు.
* ప్రజల వినిమయ వ్యయం 2017-18లో భారీగా 8.8 శాతం పడిపోయిందని ఎన్ఎస్ఒ సర్వే చెబుతోంది.
*పట్టణాల్లో గత ఆరేళ్ల పరిస్థితులు కొంత మెరుగుపడడంతో వినిమయ వ్యయం రెండు శాతం మేర పెరిగింది.
*ప్రజల వినిమయ వ్యయం శక్తి పడిపోవడమంటే దేశంలో పెద్దఎత్తున పేదరికం పెరగడం.
* గ్రామీణ మార్కెట్ ప్రభావం వలన ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పడిపోయింది.
* పేదరికంలోకి జారి పోతున్న వారి సంఖ్య గతం కంటే 10 శాతం పెరిగింది.
*2017-18 కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నెలవారీగా ఆహారంపై చేసే ఖర్చు 10 శాతం పడిపోయి రూ.580.3కి తగ్గింది. ఇది 2011-12లో 643.3గా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు 2011-12లో రూ.943.1గా ఉన్న వినిమయ వ్యయం 2017-18కి అతిస్వల్పంగా పెరిగి 946.1కి చేరింది.
* ప్రజల వినిమయ వ్యయం పడిపోవడం ద్వారా పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తద్వారా పేదరికం మరింత పెరుగుతుంది.