Current Affairs Telugu Daily

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు

*  నవంబర్ 16వ తేదీన ఉదయం 7గంటలకు  శ్రీలంక వ్యాప్తంగా పోలింగ్‌ ప్రారంభమైంది.సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది మైనారిటీ ఓటర్లను బస్సుల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు.
*రిలో 35 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, బ్యాలెట్ పేపర్ దాదాపు మూడు అడుగుల పొడవు ఉన్నప్పటికీ, ప్రధానంగా యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి) డిప్యూటీ లీడర్ సాజిత్ ప్రేమదాస, శ్రీలంక పోదుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి)కు చెందిన గోటబయ రాజపక్సే మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
*హత్యకు గురైన మాజీ అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస కుమారుడు, యూకె,యూఎస్ విద్యావంతుడైన సాజిత్ తాజా ఎన్నికల్లో దాదాపు 160 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు.
*యూఎన్‌పీ అభ్యర్థిగా సాజిత్‌--అవినీతిమయమైన శ్రీలంక రాజకీయాల్లో సాజిత్ క్లీన్ ఇమేజ్ ఆయనకు ఉపయోగపడే అవకాశం ఉంది.
*కొలంబోలోని సంపన్న కుటుంబాల్లో సాజిత్ కుటుంబం ఒకటైనప్పటికీ.. విలాసాలకు ఆయన కాస్త దూరంగానే ఉన్నాడు.ఈయన  పేదిరకం,గ్రామీణ ప్రజలపై ఎక్కువ దృష్టి సారించాడు. 
* మరో ప్రధాన అభ్యర్థి గొటబయ రాజపక్సే. ఈయన మాజీ రక్షణ కార్యదర్శి, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సే తమ్ముడు.జాతీయ భద్రత,ఐక్యత పేరుతో గొటబయ రాజపక్సే ఓట్లు కోరుతున్నారు. 1948లో బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం తర్వాత శ్రీలంకలో ఇప్పటికీ రెండు అంతర్యుద్దాలు జరిగాయి. గత ఏడాది జరిగిన ఈస్టర్ పేలుళ్లను ప్రస్తావిస్తూ.. యూఎన్‌పీ అధికారంలోకి వస్తే వ్యక్తిగత భద్రతకు హామీ ఉండదని ప్రచారం చేశారు.
*దేశంలోని శక్తివంతమైన బౌద్ద మత పెద్దలు కూడా ఎవరికి మద్దతు అనే విషయంలో భిన్నాభిప్రాయంతో ఉన్నారు.
*గొటబయ రాజపక్సే అమెరికా పౌరసత్వంపై వివాదం నడుస్తోంది. తాను అమెరికా పౌరసత్వం వదులుకున్నట్టు రాజపక్సే చెబుతున్నప్పటికీ.. దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*దక్షిణ,సబరగమువా ప్రావిన్స్‌లో గొటబయ రాజపక్సే ఆధిక్యం కనబర్చే అవకాశాలు ఉన్నాయి. ఉవా,సెంట్రల్&నార్త్ ప్రావిన్స్‌లో సాజిత్‌తో ఆయనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. నార్తర్న్,ఈస్టర్న్&నార్త్-వెస్టర్న్ ప్రావిన్స్‌లలో సాజిత్ ఆధిక్యం కనబర్చే అవకాశం ఉంది. దేశ రాజధాని కొలంబోలో అత్యధిక జనాభా కలిగిన వెస్టర్న్ ప్రావిన్స్‌లో ఓట్ల కోసం ఇద్దరు అభ్యర్థులు తీవ్రంగా ప్రచారం చేశారు.
*మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున (జెవిపి) తమ అభ్యర్థిగా అనురా కుమార దిసానాయకను నిలబెట్టింది.
* సివిల్ సొసైటీ అభ్యర్థిగా మాజీ ఆర్మీ చీఫ్ మహేష్ సేననాయకి కూడా బరిలో ఉన్నారు. 
* మెజారిటీ సింహళుల ఓట్లు గనుక గొటబయ రాజపక్సేకి దక్కితే సాజిత్‌ను ఆయన ఓడించే అవకాశం ఉండవచ్చు. 
*శ్రీలంక ఎన్నికల్లో మొదటిసారి రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కిస్తారు.
* మొత్తం 22 మిలియన్ల జనాభా ఉన్న శ్రీలంకలో 16మిలియన్ల మందికి ఓటు హక్కు ఉంది. 
*శ్రీలంక చరిత్రలోనే మొదటిసారిగా సిట్టింగ్ అధ్యక్షుడు,ప్రధాని లేదా ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి.


views: 608



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams