Current Affairs Telugu Daily

 ఒకే దేశం-ఒకే వేతన దినం

*'ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు' నినాదానికి కొనసాగింపుగా మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డును వినియోగంలోకి  తీసుకువచ్చింది.
*కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ ---శ్రామికవర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 'వన్‌ నేషన్‌.. వన్‌ పే డే'ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
* దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో ఒకే రోజు వేతనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
*అలాగే కార్మికులకు మెరుగైన జీవితం గడిపేందుకు అన్ని రంగాల్లో ఒకే విధంగా కనీస వేతనాలు ఉండేలా చర్యలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
* 2014 సంవత్సరం నుండి  కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సంస్కరించేందుకు చర్యలు తీసుకుంది.
* అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ రూ.3వేల పెన్షన్‌తో పాటు వైద్య బీమా అందించేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
*ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న వాటిల్లో ప్రైవేటు సెక్యూరిటీ ఇండస్ట్రీ అతి పెద్దది.ప్రస్తుతం 90 లక్షల మంది ఇందులో పని చేస్తున్నారు.
*భవిష్యత్‌లో ఈ సంఖ్య 2 కోట్లకు చేరే అవకాశం ఉంది.
*సుమారు 44 కార్మిక చట్టాలను నాలుగు వర్గాలుగా విభజించి చట్టాలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
*అందులో భాగంగా 13 కార్మిక చట్టాలను ఒకే కోడ్‌ కిందకు తీసుకొస్తూ వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిచేసే పరిస్థితులకు సంబంధించి (ఓఎస్‌హెచ్‌) కోడ్‌ బిల్లును సిద్ధం చేసింది. కార్మికుల భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన మొత్తం 13 చట్టాలు ఇందులో ఉన్నాయి.


views: 610



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams