Current Affairs Telugu Daily

రంజన్ గొగొయ్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ

*సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నవంబర్ 17న రిటైర్ అవుతున్నారు.
* రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను కొనసాగించనున్నారు. అయోధ్య తీర్పుకు ముందు ప్రభుత్వం ఆయనకు కల్పించిన భద్రత.. రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగనుంది.
*కొనసాగనుంది. రిటైర్మెంట్ తర్వాత గొగొయ్ తన స్వస్థలం అసోంలోని దిబ్రుఘర్‌లో స్థిరపడే అవకాశం ఉండటంతో.. అక్కడున్న గొగొయ్ ఇంటికి ఇప్పటికే భద్రత ఏర్పాటు చేశారు.
* దిబ్రుఘర్‌తో పాటు గువాహటిలోని మరో ఇంటికి కూడా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు.
*నవంబర్ 9న అయోధ్య రామ మందిరం-బాబ్రీ మసీదు స్థల వివాదంపై గొగొయ్ నేత్రుత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
*వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాలు రామజన్మభూమి న్యాస్‌కు అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. 
*ముస్లింలకు ప్రత్యామ్నాయంగా మరో చోట ఐదెకరాలు కేటాయించనున్నారు.ఇక శబరిమలలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం ఏడుగురు సభ్యుల బెంచ్‌కు బదిలీ చేశారు.
*రంజన్ గొగోయ్ పదవి విరమణ తర్వాత శరత్ అరవింద్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
*ఢిల్లీ పోలీస్ లేదా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ లేదా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వ్యక్తులు కల్పించే సెక్యూరిటీని  'Z' క్యాటగిరి అంటారు. ఎస్కార్ట్ కారు సదుపాయం కల్పిస్తారు.


views: 623Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams