Current Affairs Telugu Daily

మలేషియా నుండి పామాయిల్ కొనుగోళ్లు 

*భారతీయ రిఫైనర్లు.. మలేషియా పామాయిల్ కొనుగోళ్లకు మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నారు. 
*నెల రోజుల విరామం తర్వాత మలేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకునే దిశగా దేశీయ వ్యాపారులు ప్రయత్నాలు చేపడుతున్నారు.
* టన్నుకు 5 డాలర్లు (సుమారు రూ.360) చొప్పున రాయితీని మలేషియా ప్రకటించడంతో అక్కడి నుంచే పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాలని భారతీయ వ్యాపారులు భావిస్తున్నారు.
*డిసెంబర్ నెల కోసం దాదాపు 70 వేల టన్నుల పామాయిల్ దిగుమతులకు ఒప్పందాలను దేశీయ రిఫైనరీలు కుదుర్చుకున్నాయి. 
*కశ్మీర్‌పై భారత్ వైఖరిని మలేషియా విమర్శించిన నేపథ్యంలో మలేషియా నుంచి పామాయిల్ కొనుగోళ్లను ఆపేయాలని తమ వర్తక సభ్యులను ఎస్‌ఈఏఐ వాణిజ్య సంఘం ఆదేశించింది. 
*ఇండోనేషియా నుంచి దిగుమతులు మొదలు పెట్టారు. 
*ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత మలేషియానే పామాయిల్‌ను అధికంగా ఉత్పత్తి, ఎగుమతి చేస్తున్నది. మలేషియా నుంచి పామాయిల్, పామ్ ఆధారిత ఉత్పత్తులను భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నది. గతేడాది మలేషియా పామాయిల్ ఎగుమతుల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
* 1.63 బిలియన్ డాలర్ల కొనుగోళ్లను చేసింది. మలేషియా జీడీపీలో వెజిటబుల్ ఆయిల్ వాటానే 2.8 శాతంగా ఉన్నది. మొత్తం ఎగుమతుల్లో 4.5 శాతానికి సమానం.  
*ఇండోనేషియా అమ్మే ధర కంటే టన్నుకు 5 డాలర్లు తక్కువగానే ఇస్తామని మలేషియా ముందుకు వచ్చింది. 
*మలేషియా పామాయిల్ కొనుగోలుదారుల్లో భారతే అగ్రస్థానంలో ఉన్నది.views: 644Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams