Current Affairs Telugu Daily

మూడున్నరేళ్ల కనిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం 

*టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మూడున్నరేళ్ల (2016 జూన్‌) కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
 *తయారీరంగ వస్తువులు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో అక్టోబర్ నెలకుగాను టోకు ద్రవ్యోల్బణం మూడున్నరేండ్ల కనిష్ఠ స్థాయి 0.16 శాతానికి పడిపోయింది.
* అక్టోబరులో 0.16 శాతానికి పరిమితమైంది.
* సెప్టెంబరులో సూచీ 0.33 శాతంగా నమోదైంది. అక్టోబరులో ఆహార టోకు ధరల వార్షిక పెరుగుదల 9.80 శాతంగా ఉంది.
*ఆహారేతర ధరలు వార్షిక ప్రాతిపదికన 2.35 శాతం పెరిగాయి. కూరగాయల టోకు ధరలు 19.43 శాతం నుంచి  38.91 శాతం పెరిగాయి.
*బంగాళాదుంప రేటు మాత్రం 19.60 శాతం తగ్గింది.
*రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాదిన్నర గరిష్ఠ స్థాయికి చేరుకోగా టోకు సూచీ మాత్రం తగ్గింది.
*అక్టోబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.62 శాతంగా నమోదైంది. 
* ఆహారోత్పత్తుల ధరలు పెరుగడం ఇందుకు దోహదం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో 3.99 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం గతేడాది అక్టోబర్‌లో 3.38 శాతంగా ఉన్నది.

 


views: 620Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams