Current Affairs Telugu Daily

భోపాల్‌ గ్యాస్‌ కార్యకర్త అబ్దుల్‌ జబ్బర్‌ మృతి 

భోపాల్‌ గ్యాస్‌ బాధితుల కోసం పోరాడిన సామాజిక కార్యకర్త అబ్దుల్‌ జబ్బర్‌ నవంబర్ 14 వ తేదీన కన్నుమూశారు.
*1984, డిసెంబర్‌ 2-3 తేదీల్లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ పురుగుల మందు ప్లాంట్‌ నుంచి మిథైల్‌ ఐసోసైనేట్‌ లీక్‌ కావడంతో 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 
*20 వేల కుటుంబాల బాధితులకు అండగా ఉంటూ.. వారికి న్యాయం జరగాలని అబ్డుల్‌ జబ్బర్‌ పోరాటం చేశారు.
*భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో జబ్బర్‌ తన తల్లిదండ్రులను, సోదరుడిని కోల్పోయారు. జబ్బర్‌కు కూడా 50 శాతం దృష్టి లోపం వచ్చింది. 
* ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌ వ్యాధితో బాధపడ్డారు. 
*భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన మహిళా ఉద్యోగ్‌ సంఘటన్‌ పేరిట సంస్థను ఏర్పాటు చేసి బాధితుల తరపున జబ్బర్‌ ఉద్యమించారు. 
*భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన కొద్దిసేపటికే యూనియన్‌ కార్బైడ్‌ సీఈవో వారెన్‌ అండర్సన్‌ తప్పించుకున్నాడు. ఈ కేసులో కోర్టుకు కూడా అండర్సన్‌ హాజరు కాలేదు. అమెరికాకు చెందిన అండర్సన్‌ 2013లో యూఎస్‌లో మరణించాడు.
*ఈ దుర్ఘటనను భోపాల్ విపత్తు , భోపాల్ వాయువు విషాదం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో గ్యాస్ లీక్ సంఘటనగా చెప్పవచ్చు.  ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తు. 
ఇది మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగుమందుల ప్లాంట్లో డిసెంబరు 2-3, 1984 రాత్రిలో జరిగింది. 500,000 మందికిపైగా ప్రజలు  మిథైల్ ఐసోసనియేట్ (MIC) వాయువు మరియు ఇతర రసాయనాల ప్రభావానికి గురయ్యారు. భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 56 వార్డులు ఉంటే- 36 వార్డుల్లో విషవాయువు యొక్క ప్రభావం ఉండింది.
*విపత్తు యొక్క అసలు కారణాలు వివాదాస్పదం. భారతీయ ప్రభుత్వం మరియు స్థానిక కార్యకర్తలు వాదనల ప్రకారం, నిర్లక్ష్యమైన నిర్వహణ మరియు సరైన నిర్వహణా పద్ధతులనుండి దూరంగా జరగడం కారణంగా సాధారణ నిర్వహణా గొట్టాలలోని నీరుని ఒక MIC ట్యాంక్లోకి చేరి, ఈ విపత్కర పరిస్థితిని పరిస్థితిని సృష్టించింది. దురుద్దేశ్యపూర్వకంగానే కొంతమంది MIC ట్యాంక్లోకి నీటిని సరఫరా చేసినట్లుగా యునియన్ కార్బైడ్ కార్పోరేషన్ (యుసిసి) వాదిస్తున్నది.


views: 627



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams