Current Affairs Telugu Daily

రూ.6 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూలు 

*కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ పీసీ మోదీ --ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.6 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 
*ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది సగానికన్నా తక్కువ.
*సత్వరం రీఫండ్స్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రీఫండ్స్‌ 20% పెరిగాయి.
*ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.13.35 లక్షల కోట్ల వసూళ్ల లక్ష్యం చేరుకుంటామని  పీసీ మోదీ పేర్కొన్నారు.
*ఇన్కమ్ టాక్స్ విభాగం వారు  faceless e-assessment అనే పథకాన్ని ప్రారంభించారు.  దీని ముఖ్య ఉద్దేశం అధికారులు మరియు పన్ను చెల్లింపుదారుల మధ్య ఎలాంటి సంబంధం లేకుండా చేయడం.
*జాతీయ ఈ-అసెస్మెంట్ సెంటర్ లో 58,322 కేసులు ఉన్నాయి.
*కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1963 కింద దీనిని ఏర్పాటు చేసారు.


views: 597



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams