Current Affairs Telugu Daily

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం మార్గదర్శకాలు 

*వైసీపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం మార్గదర్శకాలు విడుదల చేసింది. 
 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేశారు .
*అన్ని రకాల బియ్యం కార్డు కల్గిన వారు అర్హులే.
*వైయస్ఆర్ పెన్షన్ కనుక కార్డు, జగన్నన్న విద్యా, వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా అర్హులు. ఇతర కుటుంబాలకు, ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి.
*12 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి, 35 ఎకరాల కన్నా తక్కువ పొడి భూమి ఉన్న భూ యజమానులు అర్హులు.
*తడి, పొడి భూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు.
*వార్షిక ఆదాయం 5 లక్షల కంటే తక్కువ లేదా ఎక్కువ ఉన్న కుటుంబాలకు అర్హులు.
*5.00 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు
*3000 SFT (334 చదరపు Yds) కన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు
*5.00 లక్షలోపు వా ర్షిక ఆదాయం ఉన్న అవుట్ సో ర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అర్హులు
*ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు
*కుటుంబంలో ఒక కారు ఉన్నా వైెఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు.కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులు.
*ఇటీవలే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రిల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేశారు.
*ఏపీలో లేని కొన్ని వైద్యసేవలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఉండటంతో అక్కడ కూడా ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 


views: 650



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams