Current Affairs Telugu Daily

రోగులకు మందులు అందించనున్న ఆశా మరియు అంగన్వాడీ వర్కర్లు 

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వైద్య రంగంలో నూతన సంస్కరణలు 
* జాతీయ స్థాయిలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వైద్య రంగంలో నూతన సంస్కరణలకు నాంది పలుకుతూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.
*దీని ప్రకారం ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో మందులను నిల్వ చేసి రోగులకు అందించే విధంగా ప్రతిపాదనలను కేంద్రం సిద్ధం చేసింది. 
* ఈ ముసాయిదా నోటిఫికేషన్‌ను అన్ని రాష్ట్రాలకు వారి అభిప్రాయాలను తెలియచేయాలని కేంద్రం పంపింది. 
* డ్రగ్స్, కాస్మోటిక్స్ రూల్స్ 1945ను సవరించాలని ప్రతిపాదిస్తూ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. 
*ప్రస్తుతం అమలులో ఉన్న దాని ప్రకారం ఫార్మసిస్టులు, డాక్టర్లు మాత్రమే మందులను నిల్వ ఉంచుకుని రోగులకు ఇవ్వాలి.
* కొత్త ప్రతిపాదనల ప్రకారం ఆరోగ్య కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, నర్సులు, మిడ్‌వైఫ్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్ల పరిధిలో పనిచేసే కార్యకర్తలు మందులను స్టాక్ చేసి రోగులకు పంపిణీ చేయవచ్చును. 
*గుర్తింపు పొందిన ఆరోగ్య, వైద్య కార్యకర్తలు (ఆషా) కార్యకర్తలు కూడా మందులను ఇచ్చేందుకు అర్హత లభిస్తుంది. 
* ఔషధ సాంకేతిక సలహా మండలి అనుమతి తీసుకుని కేంద్రం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది.
*ఈ నోటిఫికేషన్ తమ ఉపాధికి, వృత్తికి ముప్పుగా తయారవుతుందని ఫార్మసిస్టులు ఆందోళన చెందుతున్నారు. 
*గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో లక్షల్లో ప్రభుత్వ ఏజన్సీల ద్వారా ఆరోగ్య కార్యకర్తలు పనిచేస్తున్నారు. కాని వారికి మందులు ఇచ్చేవారుండరు. డాక్టర్ల చీటిపైనే వీరు మందులు ఇస్తారు. ప్రజారోగ్య వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పుల వల్ల మందులను సకాలంలో రోగులకు అందించేందుకు వీలవుతుంది.
*ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్హత ఉన్న డాక్టర్లు మందుల చీటి ఇస్తారు. కాని మందులు ఇచ్చేందుకు ఫార్మసిస్టులు ఉండరు. ఈ కొత్త ప్రతిపాదన వల్ల ప్రజారోగ్య వ్యవస్థలో మౌలిక సదుపాయాలను  కల్పించినట్లు అవుతుంది.
* ఇప్పటికే ఆన్‌లైన్‌లో మందుల సరఫరా వల్ల ఫార్మాసిస్టుల ఉపాధికి ముప్పు తలెత్తింది.
*ఫార్మసీ విద్య చదవకుండా ఒక సాధారణ ఆరోగ్య కార్యకర్త మందులను ఎలా పంపిణీ చేస్తారని ఫార్మసిస్టులు వాదిస్తున్నారు.
 


views: 607Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams