Current Affairs Telugu Daily

ఫ్లిప్‌కార్ట్‌ ప్లాస్టిక్ కవర్ల సేకరణ

* పర్యావరణ పరిరక్షణకు ఫ్లిప్‌కార్ట్‌ ప్లాస్టిక్‌ కవర్లను సేకరించేందుకు పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది.
*వినియోగదారులనుంచి ప్లాస్టిక్‌ సంచులను సేకరించాలని నిర్ణయించింది. 
*ఇందుకోసం ఒక పైలట్‌ ప్రాజెక్టు అమలు చేస్తోంది. వ్యవస్థలో ఉన్న ప్లాస్టిక్ ప్యాకేజింగ్లను రీసైకిల్ చేయడంతో పాటు, తిరిగి ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. 
* ప్లాస్టిక్‌ వ్యర్థాలు ముప్పుగా పరిణమించుతున్నతరుణంలో ఫ్లిప్‌కార్ట్‌ ఈ చర్యకు దిగింది.
*సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ఇప్పటికే 33 శాతం తగ్గించిన కంపెనీ మార్చి 2021 నాటికి దాని సప్లయ్‌ చైన్‌లో 100శాతం రీసైకిల్ ప్లాస్టిక్ వినియోగం వైపు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
* ముఖ్యంగా చెన్నై, ముంబై, బెంగళూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, అహ్మదాబాద్‌లోని ఎంపిక కేంద్రాలలో వినియోగదారుల నుండి ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తిరిగి సేకరించేందుకు ఫ్లిప్‌కార్ట్ పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. 
* ఈ కార్యక్రమం కింద, తమ ప్రొడక్ట్స్‌ డెలివరీ సమయంలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను స్వచ్ఛందంగా కంపెనీకి చెందిన ఫ్లిప్‌కార్ట్ విష్-మాస్టర్స్‌కు అప్పగించమని వినియోగదారులకు ఒక సమాచారం పంపుతుంది. 
*  ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు, వివిధ కోణాలను వివరించి, వినియోగదారుల్లో అవగాహనపెంచేందుకు, విష్-మాస్టర్స్‌కు సరైన శిక్షణ కూడా ఇచ్చింది.  సేకరించిన ప్యాకెట్లు రిజిస్టర్డ్ విక్రేతలకు పంపించి, రీసైకిల్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది.


views: 612



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams