Current Affairs Telugu Daily

వశిష్ఠ నారాయణ్‌ సింగ్‌ మృతి 

*ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతాన్ని సవాలు చేసిన ప్రఖ్యాత గణితవేత్త వశిష్ఠ నారాయణ్‌ సింగ్‌ నవంబర్ 14వ తేదీన పాట్నాలో కన్నుమూశారు. 
* ఆయన వయస్సు 74 ఏళ్లు. 40 ఏళ్లుగా స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్నారు. 
*నారాయణ్‌ 1942లో ఏప్రిల్‌ 2న బిహార్‌లోని బసంత్‌పూర్‌ గ్రామంలో జన్మించారు.
*ఆయనను 'వశిష్ఠ బాబు'గా పిలుస్తుంటారు. 1969లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి 'సైకిల్‌ వెక్టార్‌ స్పేస్‌ సిద్ధాంతం'పై పీహెచ్‌డీ చేశారు. అనంతరం అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)లో పనిచేశారు. 1971లో భారత్‌కు తిరిగొచ్చారు. కాన్పూర్‌ ఐఐటీ, కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన ఆచార్యుడిగా పనిచేశారు.
* ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాన్ని సవాలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.


views: 654



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams