Current Affairs Telugu Daily

బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోదీ

* బ్రెజిల్‌ రాజధాని బ్రెసీలియాలోని ఇటమరటి ప్యాలెస్‌లో నిర్వహించిన 11వ బ్రిక్స్‌ సదస్సులో బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా అధ్యక్షుల సమక్షంలో మోదీ ప్రసంగించారు.
*ఉగ్రవాదం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ట్రిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 
*వర్ధమాన దేశాల ఆర్థిక వృద్ధి 1.5 శాతం తగ్గిపోయిందని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి.
*అభివృద్ధికి, శాంతి సౌభాగ్యాలకు ఉగ్రవాదం అతి పెద్ద ముప్పు అని బ్రిక్స్ సదస్సులో మోడీ పేర్కొన్నారు.
*మోదీ ప్రసంగం లోని అంశాలు-
*పదేళ్లలో 2.25 లక్షల మంది ప్రజలను ఉగ్రవాదం బలి తీసుకుంది.సమాజాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు.
*  ఉగ్రవాదం సృష్టించిన అనుమానాస్పద వాతావరణం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, మాదకద్రవ్యాల రవాణా, వ్యవస్థీకృత నేరాలు పరోక్షంగా వ్యాపార వాణిజ్య రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
*ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాలు, పరస్పర సహకారంపై చర్చించేందుకు బ్రిక్స్‌ దేశాలు తొలిసారి కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. 
* ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు బ్రిక్స్‌ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
*ఐక్యరాజ్య సమితిలో వెంటనే సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని మోదీ, మిగతా నాలుగు బ్రిక్స్‌ దేశాల అధినేతలు  పేర్కొన్నాయి.
* ‘న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌’ ప్రాంతీయ కార్యాలయాన్ని భారత్‌లో వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని మోదీ కోరారు. వచ్చే బ్రిక్స్‌ సమావేశాల నాటికి సభ్య దేశాల మధ్య 500 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
*11వ బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారొతో విడివిడిగా భేటీ అయ్యారు.
*మోదీ మరియు జిన్‌పింగ్‌ తొలిసారి బ్రెజిల్‌లోనే కలిశారు అన్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు.
*వాణిజ్యం, పెట్టుబడులు తదితర ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించారు. 
*వచ్చే ఏడాది మే 9న మాస్కోలో నిర్వహించే ‘విక్టరీ డే’ ఉత్సవాలకు రావాలని మోదీని పుతిన్‌ ఆహ్వానించారు.
*రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మాస్కోలో విక్టరీ ఉత్సవాలను నిర్వహిస్తారు.
*2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 25 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని ఇప్పటికే సాధించడం పట్ల మోదీ మరియు పుతిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. 
*చమురు, సహజ వాయువు దిగుమతుల విషయంలో ప్రగతి, నిలకడైన పరిస్థితి కొనసాగడం పట్ల కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. వౌలిక సదుపాయాల రంగంలోనూ సాధించిన ప్రగతిని సమీక్షించారు. రక్షణ, పౌర అణు ఇంధన రంగంలో కూడా రెండు దేశాలు సన్నిహితంగా ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు.
*పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, జల నిర్వహణ సవాలుగా మారాయని, బ్రిక్స్‌ దేశాల తొలి జలవనరుల మంత్రుల సమావేశాన్ని భారత్‌లో నిర్వహించాలని భారత్ భావిస్తున్నట్లు మోడీ తెలిపారు.
*‘ఇటీవలే భారత్‌లో ఫిట్‌ ఇండియా ఉద్యమాన్ని  ప్రారంభించింది.. ఫిట్‌నెస్, ఆరోగ్యం విషయాల్లో సభ్య దేశాల సంప్రదింపులు మరింత పెరగాలని కోరుకుంటున్నట్టు మోడీ ప్రసంగంలో పేర్కొన్నారు.
* ‘ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్‌ దేశాల మధ్య జరిగే వాణిజ్యం వాటా కేవలం 15 శాతమే. కానీ ఈ ఐదు దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 40% పైగా ఉంది. అందువల్ల వాణిజ్యం, పెట్టుబడుల్లో ద్వైపాక్షిక సహకారంపై బ్రిక్స్‌ దేశాలు దృష్టి పెట్టాల్సి ఉంది.
* వచ్చే 10 సంవత్సరాల్లో బ్రిక్స్‌ దిశ ఎలా ఉండాలోచర్చించాలని మోడీ పేర్కొన్నారు.
*  ఈ సదస్సుకు ‘సృజనాత్మక భవితకు ఆర్థికాభివృద్ధి’ అనే థీమ్‌ సరైనదని మోదీ అన్నారు.
*2020లో భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బొల్సొనారొ పాల్గొననున్నారు. 
*బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సొనారొతో మోదీ సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి.
*2024 నాటికి భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో భాగంగా ఇన్‌ఫ్రా రంగానికే 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాలని మోడీ పేర్కొన్నారు.
*బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరిగేలా వ్యాపార నిబంధనలు సరళతరం కావాలని మోడీ పేర్కొన్నారు.
* సభ్య దేశాలు కలిసి పనిచేసేందుకు వీలున్న రంగాలు గుర్తించాలని, పరస్పరం సహకరించుకుని ఎదగాలని ప్రధాని సూచించారు. 
*ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ బ్రిక్స్‌ దేశాలు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 50% బ్రిక్స్‌ దేశాలదే. కొన్ని కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాయి. సాంకేతికత, సృజనాత్మకతలో కొత్త విజయాలు సాధించాయని మోడీ పేర్కొన్నారు. 
*జిన్‌పింగ్-- షాంగైలో తాము జరిపిన దిగుమతి-ఎగుమతి ప్రదర్శనలో పాల్గొన్నందుకు జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. గత ఏటాది కంటే కూడా ఈ ఏడాది భారత లావాదేవీల పరిమాణం గణనీయంగా పెరిగిందని జిన్‌పింగ్ అన్నారు.
*బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కలిసి ఓ కూటమిగా ఏర్పాటయ్యాయి. ఈ కూటమినే బ్రిక్స్ దేశాల కూటమిగా పేర్కొంటారు. ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. ఈ సదస్సులో ఐదు దేశాలకు చెందిన దేశాధినేదలు పాల్గొంటూ వుంటారు.


views: 635Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams