Current Affairs Telugu Daily

ప్లాస్టిక్ కు స్వీట్లు 

విజయనగరం నగరంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తుల నిషేధంపై ఈ విడత వినూత్న పంధాతో కార్పొరేషన్‌ ముందడుగు వేస్తోంది. ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా కేజీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇస్తే వారికి పావు కిలో స్వీట్‌బాక్స్‌ ఇస్తారు. 
* సుప్రీంకోర్టు నిషేధించిన 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌తో పాటు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణకు చర్యలు తీసుకోనుంది. 
*మరింత మంది దాతలు ముందుకొస్తే అర డజను గుడ్లను ప్యాక్‌ చేసి అందించాలని భావిస్తున్నారు. అదే పెద్ద పెద్ద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు ఒకేసారి 250 కిలోల ప్లాస్టిక్‌ను ఇస్తే వారికి భారీ నజరానా చెల్లించనున్నారు. 
*ఇంట్లో ఉండే హానికరమైన ఒక్కసారి వినియోగించే పారేయాల్సిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించనున్నారు. 
*ఈ ఏడాదిలో కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ విక్రయాలపై ప్రజారోగ్య విభాగం అధికారులు చర్యలు చేపడుతున్నారు.
* దాదాపు 80 శాతం ఈ తరహా ప్లాస్టిక్‌ను వినియోగించేందుకు వెనకాడుతున్నారు.
*250 కిలోలకు పైగా ప్లాస్టిక్‌ను అందజేసిన వారిని జనవరి 26న కలెక్టర్‌తో సన్మానించనున్నట్టు ప్రకటించారు. 
*నలభై వేల ఇళ్లకు గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.


views: 592



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams