Current Affairs Telugu Daily

మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం 

మహారాష్ట్రలోప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు సిద్ధమయ్యాయి. 
*కనీస ఉమ్మడి కార్యక్రమానికి మూడు పార్టీల అధినేతలు అంగీకారం తెలిపారు. 
*ప్రభుత్వ ఏర్పాటు అనంతరం పదవుల పంపకాలపై కూడా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
*రాష్ట్ర రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైన సీఎం పిఠాన్ని ఐదేళ్లపాటు శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ అంగీకరించాయి. 
*కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్‌, ఎన్సీపీకి మండలి చైర్మన్‌ దక్కేలా నేతలు అంగీకారానికి వచ్చారు.
*శివసేనకు సీఎంతో పాటు 14 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, 14 మంత్రి పదవులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎంతో పాటు 12 మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
* ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలవుతుంది.
అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడైన నాటి నుంచి మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి త్వరలోనే ముగింపు వచ్చే అవకాశం ఉంది.


views: 594



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams