Current Affairs Telugu Daily

రాష్ట్రాలకు ప్రత్యేక జెండా నిబంధన రాజ్యాంగంలో లేదు : హోంశాఖ
రాష్ట్రాలకు విడివిడిగా జెండాలను అనుమతించే నిబంధన ఏదీ రాజ్యాంగంలో కేంద్ర హోం శాఖ స్పష్టం లేదని పేర్కొంది. దేశ మంతటికీ ఒకే పతాకం ఉంటుందని, అది...త్రివర్ణ పతాకం మాత్రమేనని స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందించుకునేందుకు కమిటీ నియమించటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం పసుపు, కుంకుమ వర్ణాతో దీర్ఘ చతురస్రాకార వస్త్రంపై కర్ణాటక చిత్రపటాన్ని ముద్రించి కన్నడ జెండాగా గౌరవిస్తున్నారు. రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్ముకశ్మీరుకు మాత్రమే ప్రత్యేక జెండా ఉంది. 2017 డిసెంబరులో దావణగెరెలో నిర్వహించనున్న ప్రపంచ కన్నడ సమ్మేళనం నేపథ్యంలో  కర్ణాటక సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నేతృత్వంలో 9 మంది సభ్యులతో తమ రాష్ట్రానికి ప్రత్యేక పతాకం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడం కొరకు కర్ణాటక ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి - సిద్ధరామయ్య 

views: 1003

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams