Current Affairs Telugu Daily

యూనెస్కో సమావేశాల్లో భారత్

*ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరుగుతున్న యునెస్కో సమావేశాల్లో పాకిస్థాన్ ను భారత్ ఎండగట్టింది. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంతస్కృతిక సంస్థ(యునెస్కో) సదస్సులో పాక్‌ లేవనెత్తిన కశ్మీర్‌ అంశాన్ని భారత్‌ తిప్పికొట్టింది.ఇలాంటి అత్యున్నత వేదికల్ని రాజకీయం చేయడాన్ని ఏ సభ్యదేశాలు సహించకూడదని అనన్య అగర్వాల్‌ పిలుపునిచ్చారు.
*ఈ సమావేశాల్లో భారత బృందానికి నాయకత్వం వహిస్తున్న వారు- అనన్య అగర్వాల్
* అనన్య అగర్వాల్ పేర్కొన్న అంశాలు--- పాకిస్థాన్ డీఎన్ఏలోనే టెర్రరిజం ఉంది.
ఆర్థిక ఇబ్బందులు, మనో దౌర్భల్యంతో బాధపడుతున్న ఆ దేశం విఫల దేశ స్థాయికి పడిపోయింది.  అన్ని రకాలుగా ఆ దేశం చీకటిలో మగ్గి పోతుంది. తీవ్రవాదులకు, సంఘ విద్రోహశక్తులకు ఆ దేశం ఓ స్థావరంలా తయారయింది. 
*2018లో విడుదల చేసిన అత్యంత సులువుగా పతనమయ్యే అవకాశం ఉన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ కు 14వ స్థానం దక్కిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు .
*సెప్టెంబర్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు తలపడితే... వాటి పర్యవసానాలు సరిహద్దులను దాటి వెళతాయని హెచ్చరించారని గుర్తు చేశారు. 
*1947లో పాకిస్థాన్ లో మైనార్టీలు 23 శాతం మంది ఉండేవారని... ఇప్పుడు వారి సంఖ్య కేవలం 3 శాతం మాత్రమే ఉందని అనన్య తెలిపారు.
*ప్రపంచం అంగీకరించలేని చట్టాలు, తీవ్ర ఒత్తిడి, దాడులతో క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు, అహ్మదీయులు, షియాలు, పష్తూన్లు, సింధీలు, బలోచీలను మతమార్పిడులకు పాల్పడే విధంగా చేశారని అన్నారు. 
*లింగ వివక్ష, మహిళలపై దాడులు, యాసిడ్ దాడులు, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, బలవంతపు మత మార్పిడులు తదితర సమస్యలు పాకిస్థాన్ ను పీడిస్తున్నాయని ఈమె పేర్కొన్నారు.
* ఐక్యరాజ్యసమితి వేదికను ఏ దేశం కూడా దుర్వినియోగం చేయకుండా యునెస్కో మెంబర్ షిప్ చర్యలు తీసుకోవాలని కోరారు.
*ఒసామా బిన్‌ లాడెన్‌, హక్కానీ నెట్‌వర్క్‌ లాంటి వారిని ఇటీవల పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్‌ హీరోలుగా అభివర్ణించడాన్ని గుర్తుచేసి పాక్‌ నిజస్వరూపాన్ని సదస్సు ముందు బట్టబయలు చేశారు. భారత్‌పై విషం చిమ్ముతూ యునెస్కో వేదికను రాజకీయం చేయడాన్ని ఖండించారు. 
*ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో), United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO), ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945 లో స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణ లకు తన తోడ్పాటు నందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం మరియు సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటు పడుతుంది. ఇది నానాజాతి సమితి యొక్క వారసురాలు కూడా.
యునెస్కోలో 193 సభ్యులు మరియు 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, పారిస్, ఫ్రాన్సులో గలదు.


views: 617Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams