Current Affairs Telugu Daily

పాల నాణ్యతకు పరీక్ష 

*పాలనాణ్యత, తాజాదనా న్ని 13 నిమిషాల్లోనే తేల్చగల కాగితం సెన్సర్‌ను ఐఐటీ గువహటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
*బయోసైన్స్‌ అండ్‌ బయో ఇంజనీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రంజాల్‌ చంద్ర నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ ఆవిష్కరణ చేసింది. 
* ఐఐటీజీ శాస్త్రవేత్తలు ఒక ఫిల్టర్‌ పేపర్‌కు పాలలోని హాని కారక ఆల్కలైన్‌ ఫాస్పేటేజ్‌(ఏఎల్‌పీ)ని గుర్తించే బీసీఐపీ అనే రసాయన సమ్మేళనాన్ని కలిపారు.
*దాన్ని ముడి పాలలోకి వదలగానే బ్యాక్టీరియాలతో రసాయన చర్య జరిగి, 'నీలి-ఆకుపచ్చ' రంగు అవక్షేపం పాలగ్లాసు అడుగున పేరుకుపోయింది.
*ఇలా జరిగితే ఏఎల్‌పీ అవశేషాలు ఉన్నట్లు. అవక్షేపం ఏర్పడకుంటే ఏఎల్‌పీ లేదని నిర్ధారించుకోవచ్చు.  


views: 648



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams