Current Affairs Telugu Daily

ఐసీజే తీర్పు కు తలొగ్గిన పాకిస్థాన్

*కులభూషణ్‌ జాదవ్‌కు గూఢచర్యం ఆభియోగంపై పాకిస్థాన్‌ ప్రభుత్వం విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
* పాక్ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) నిలిపివేయాలన్న తీర్పుకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్‌ తలొగ్గింది. 
* ఐసీజే తీర్పును అమలుచేయడానికి పాక్ సైనిక చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది.
*ఈ సవరణ ఆధారంగా కుల్ భూషణ్ జాదవ్‌ తనకు విధించిన శిక్షపై సివిల్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. 
*ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్  ప్రావిన్స్‌లో పాక్ బలగాలు ఆయనను అరెస్టు చేశాయి.
*పాకిస్థాన్‌ న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో కులభూషణ్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
*ఇరాన్‌లో వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటుండగా పాక్‌ అక్రమంగా నిర్భందించి, న్యాయస్థానానికి కూడా అనుమతివ్వలేదని భారత్‌ పిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఐసీజే కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. 
* భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని, మరణశిక్షను పాక్‌ సమీక్షించేంతవరకు శిక్ష అమలును నిలిపివేస్తున్నట్లు నాయస్థానం ప్రకటించింది.
*అంతర్జాతీయ న్యాయస్థానం--The International Court of Justice (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" లేదా "ICJ"గా పిలువబడుతుంది) ; ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాథమిక న్యాయ అంగము. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధం లో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం మరియు తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి ఉంది.
*1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క వారసురాలు.


views: 660



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams