Current Affairs Telugu Daily

10 సంవత్సరాల్లో 11 % పెరిగిన తుఫానులు  

*భారత వాతావరణ విభాగం (ఐఎండీ)---బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో గత దశాబ్దకాలంలో తుఫానులు 11 శాతం పెరిగాయి.
*గత ఐదేళ్లలో వీటి సంఖ్య ప్రమాదకర స్థాయిలో 32 శాతం పెరిగింది.
*వాతావరణ అధికారుల ప్రకారం,గ్లోబల్‌ వార్మింగ్‌ విపత్కర ప్రభావాలకు ఇది భయంకరమైన సూచిక .
* 2018, 2019లో ఆయా ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఏడు తుఫానులు, ఆరు తీవ్ర తుఫానులు సంభవించాయి.
*1985 తర్వాత ఈ పరిస్థితి తలెత్తడం ఇదే తొలిసారి అని ఐఎండీ పేర్కొంది.
*2018,2019 లో ఆరు తీవ్రమైన తుఫానులు భారతదేశాన్ని తాకాయి ఇది 1976 నుండి అత్యధికం.
*2010-19  మధ్య కాలంలో సరాసరిగా నాలుగు తుఫానులు భారతదేశాన్ని తాకుతున్నాయి.1980 దశాబ్దంలో సరాసరి తుపానుల సంఖ్య 3  గా ఉండింది.
*గత ఐదు సంవత్సరాల్లో సరాసరి తుపానుల సంఖ్య 5 మరియు తీవ్ర తుఫాను ల  సరాసరి సంఖ్య 3.


views: 630



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams