Current Affairs Telugu Daily

 విక్టరీ డే --మోడీ కి ఆహ్వానం

*ప్రధాని నరేంద్ర మోడీకి రష్యానుంచి ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది మే నెలలో మాస్కోలో జరిగే విక్టరీ డే ఉత్సవాల్లో పాల్గొనడానికి రావాలని ప్రధాని మోడీని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానించారు. 
*జిల్‌లో జరుగుతున్న 11వ బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు.ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయడంపై ఇద్దరు చర్చించారు. 
* ఈ సమావేశంలో భారత్‌-రష్యా సంబంధాలపై సమీక్షించారు.
*విక్టరీ డే -మే 9 వ తేదీ 
*1945 లో నాజీ జర్మనీ ప్రాంతం రష్యా చేతిలో ఓడిపోయి,లొంగిపోయిన దినోత్సవాన్ని విక్టరీ డే గా నిర్వహిస్తారు.
*1945 మే 8వ తేదీ సాయంత్రం జర్మన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పై సంతకం చేసి లొంగి పోయింది.ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మే 9వ తేదీన విక్టరీడే ను నిర్వహిస్తారు.
*భారత్ రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 17 %  పెరిగిందని పుతిన్ పేర్కొన్నారు. 
*ఈ సంవత్సరం మోడీ రష్యా పర్యటనలో భాగంగా, తూర్పు ప్రాంత అభివృద్ధి కొరకు $ 1 బిలియన్ల రుణాన్ని ప్రకటించారు.మరియు  వివిధ రంగాల్లో 15 ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
* బ్రిక్స్‌ సదస్సులో మోదీ పాల్గొనడం ఇది ఆరో సారి. బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతల్లో ప్రస్తుతం బ్రెజిల్‌ ఉంది. ప్రస్తుత బ్రిక్స్‌ సదస్సును ‘సృజనాత్మక భవిష్యత్తు కోసం ఆర్థిక అభివృద్ధి’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.


views: 629



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams