Current Affairs Telugu Daily

చంద్రయాన్ -3

* రెండు నెలల క్రితం చంద్రుడిపైకి ఇస్రో పంపిన చంద్రయాన్-2 మిషన్ ప్రయోగం విఫలమవడంతో మళ్లీ చంద్రుడిపైకి మరో మిషన్‌ను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. 
*వచ్చే ఏడాది నవంబర్‌లోగా జరిగే అవకాశం ఉంది.
*చంద్రయాన్-3 పేరుతో జరగనున్న ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఓ హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది.
* ఈ కమిటీకి తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్‌ డైరెక్టర్ సోమనాథ్ నేతృత్వం వహిస్తారు. చంద్రయాన్‌-3కి సంబంధించి అన్ని ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఈ కమిటీ సమర్పిస్తుంది.
*సోమనాథ్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఇస్రో వేచి చూస్తోంది. కమిటీ నివేదిక అందగానే పనులను వేగవంతం చేసే అవకాశం ఉంది.
*ఈ సారి చంద్రయాన్-3లో రోవర్‌, ల్యాండర్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు.
*.ల్యాండింగ్ సమయంలో మళ్లీ తప్పులు పునరావృతం కాకుండా సాఫ్ట్ ల్యాండింగ్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటినీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
*ఈ ఏడాది సెప్టెంబర్ 7న చంద్రయాన్ -2 చంద్రుడి దక్షిణధృవం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాల్సి ఉండగా విక్రమ్ ల్యాండర్ గతితప్పింది. దీంతో క్రాష్ ల్యాండింగ్ జరగడంతో భూమితో సంబంధాలు కోల్పోయింది. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేశారు.  
*రంగంలోకి దిగిన నాసా ఆర్బిటార్ ల్యాండర్‌ను కనుగొనింది. అదే సమయంలో కొన్ని రోజుల తర్వాత చంద్రయాన్ ఆర్బిటార్ కూడా విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన ఫోటోలను పంపింది.
* ల్యాండర్ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు జాతీయస్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు మరికొందరు నిపుణులు ఉన్నారు. 
*ఈ కమిటీకి ఇస్రోలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్ అధిపతి నారాయణన్‌ నేతృత్వం వహించారు.
* కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతోనే ల్యాండర్‌ ఆచూకీ తెలుసుకోలేకపోయినట్లు విశ్లేషించారు. 
*ప్రయోగం సందర్భంగా ఎక్కడ తప్పులు దొర్లాయనేదానిపై పెద్ద ఎత్తున నివేదిక ఇస్రోకు కమిటీ నివేదిక సమర్పించింది.
*ప్రధాని కార్యాలయం ఈ నివేదికకు ఆమోద ముద్ర వేసిన తర్వాత రిపోర్టును బహిర్గతం చేస్తారు.


views: 646



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams