Current Affairs Telugu Daily

నాడు నేడు 

*బాలల దినోత్సవం సందర్భంగా 'మనబడి నాడు-నేడు' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
*ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్‌ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మనబడి నాడు-నేడు కార్యక్రమాన్నిప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అధికారికంగా ప్రారంభించారు. 
*'మనబడి నాడు-నేడు'లో భాగంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించనుంది. 
*తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ది చేయనున్నారు.
*ఇందుకోసం రూ.3627కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. మొదటి దశలో గ్రామీణ,గిరిజన, పట్టణ,గురుకుల పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
*రాష్ట్రంలోని 45,329 ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన బోధన అందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.

 

 జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో కలెక్టర్లు 'మన బడి నాడు-నేడు' కార్యక్రమాన్ని చేపడతారు.
- ఇప్పటికే రాష్ట్రంలోని 45,329 సూళ్ల పరిస్థితికి సంబంధించి 20.19 లక్షల ఫొటోలను కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు.
*- మౌలిక వసతుల కల్పన అనంతరం స్కూళ్ల ఫొటోలు మరోసారి తీసి తాజాగా ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలిసేలా వెబ్‌ పోర్టల్‌లో పొందుపరుస్తారు.
*- మన బడి పేరుతో నాడు-నేడు కింద చేపట్టనున్న పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు పబ్లిక్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు.


views: 667



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams