Current Affairs Telugu Daily

శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం

అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి దక్కింది.2013లో శ్రీదేవి ఏఎన్‌ఆర్‌ అవార్డును గెల్చుకున్న నటి శ్రీదేవి మరోసారి ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది.
*2019 ఏడాదికిగాను ఈ అవార్డు నటి రేఖకు దక్కింది.
*సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది పరిశ్రమలోని సినీ ప్రముఖులను గుర్తించి ఏఎన్నార్‌ అవార్డును అందించడం జరుగుతోంది. 2006లో తొలిసారిగా ఈ అవార్డును దేవ్‌ ఆనంద్‌కు అందించారు. 2017 సంవత్సరంలో ఈ అవార్డు రాజమౌళికి దక్కింది.
*నటి అంజలీ దేవి (2007), నర్తకి, నటి వైజయంతి బాలి (2008), నేపథ్యగాయని లతా మంగేష్కర్ (2009), దర్శకుడు కె. బాలచందర్ (2010), దర్శకురాలు హేమమాలిని (2011), రచయిత దర్శకుడు శ్యామ్ బెనగల్ (2012), బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ (2014), సూపర్‌స్టార్‌ కృష్ణ( 2015) ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖులు.


views: 602



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams