Current Affairs Telugu Daily

రాఫెల్ పై క్లీన్ చిట్ 

*రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై  క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
*ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు 2018, డిసెంబర్‌ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 
*. సుమారు రూ.59,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, కోర్టు పర్యవేక్షణలో దీనిపై విచారణ జరుపాలని దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. 
*తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్లు దాఖలుచేశారు.
*ఈ ఒప్పందంలో పలు కీలక విషయాలను కోర్టుకు చెప్పకుండా కేంద్రం దాచిపెట్టిందనివారు ఆరోపించారు.
*భారత్‌తరఫున చర్చల బృందంలో పాల్గొన్న ముగ్గురుసభ్యుల అసమ్మతి పత్రం కూడా ఉన్నదని పేర్కొన్నారు. అయితే ఈ పత్రాలు రహస్యమని, అనధికారికంగా వీటిని సేకరించారని, వీటిని పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్రం వాదించింది. 
* కోర్టు కేంద్రం వాదనను తోసిపుచ్చింది.పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు గత మేలో తీర్పును రిజర్వ్‌లో పెట్టగా నవంబర్ 14 వ తేదీన తీర్పును వెల్లడించింది.
*రాఫెల్ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరంలేదని స్పష్టం చేసింది.
*రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ చౌకీదార్‌ చోర్‌ హై అంటూ గతంలో కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేశారు.
*రాహుల్‌ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
*ప్రధాని మోదీని చౌకీదార్ చోర్ హై అంటూ తాను చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా ఆమోదించిందంటూ రాహుల్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. కోర్టు తీర్పును తప్పుగా అన్వయించి రాహుల్ ప్రధానిపై విమర్శలు చేశారని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ రాహుల్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలుచేశారు.
*రాహుల్‌గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. రాహుల్‌ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 


views: 599



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams