Event-Date: | 13-Nov-2019 |
Level: | National |
Topic: | Judiciary and Judgement |
రాఫెల్ ఒప్పందం,శబరిమలై పై సుప్రీం కోర్టు తీర్పు
*రఫేల్ ఒప్పందానికి క్లీన్ చిట్ ఇస్తూ సర్వోన్నత న్యాయస్దానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు నవంబర్ 14వ తేదీన తీర్పు వెలువరించనుంది.
* ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ తీర్పును వెల్లడిస్తుంది.
* గత ఏడాది డిసెంబర్ 14న రఫేల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై మే 10న అన్ని పక్షాల వాదనలు విన్న మీదట సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
*బీజేపీ మాజీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్‌లు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.
*బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ల మధ్య కుదిరిన రఫేల్ ఒప్పందంపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు గతంలో కొట్టివేసింది.
*రఫేల్ యుద్ధ విమానాల ధరలు, ఇతర వివరాలతో కూడిన పత్రాలను సుప్రీం కోర్టు పరిశీలించిన మీదట ఈ ఒప్పందానికి సర్వోన్నత న్యాయస్ధానం అంగీకారం తెలిపింది.
అలాగేశబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు నవంబర్ 14 వ తేదీన తీర్పు వెలువరించనుంది.*
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శబరిమల రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపింది.
*జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా తదితరులు ఈ ధర్మాసనంలో ఉన్నారు. రివ్యూ పిటిషన్లపై ఓ రోజంతా వాదనలు విన్న ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
*అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ గతేడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ సుప్రీంకోర్టులో మొత్తం 64 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.
*ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ఆచారాలు, సంస్కృతిని పరిరక్షించాలంటూ పిటిషనర్లు ధర్మాసనాన్ని కోరారు.
*నవంబర్ నెల 16 నుంచి మండల పూజ కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తున్న నేపథ్యంలో కేరళ పోలీసులు 10 వేలకు పైగా సిబ్బందితో శబరిమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.