Current Affairs Telugu Daily

ప్రతి పథకానికి కొత్త కార్డులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పథకానికి కొత్త కార్డులు రాబోతున్నాయి.  లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రవ్యాప్త సర్వే నిర్వహించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. 
* ఆ బాధ్యతలను వలంటీర్లు సచివాలయాలకు అప్పగించనున్నారు.
* రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు.
* నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు నెల రోజుల పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జరగనుంది.
*ప్రభుత్వ పథకాలన్నింటికి కొత్త కార్డుల జారీ చేయటం వల్ల ఏ పథకానికి ఏ కార్డు ఉపయోగపడుతుందో లబ్దిదారులకు తెలుస్తుంది.అధికారులకు కూడా ఒక స్పష్టత ఉంటుంది.
* వైయస్సార్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, అమ్మ బడి, నాయి బ్రాహ్మణులకు నగదు, వైయస్సార్ కాపు నేస్తం తదితర పథకాల కు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు కూడా విడుదల చేయనున్నారు.
* గ్రామ సచివాలయాలలో శాశ్వతంగా లబ్ధిదారుల పేర్లు వెల్లడించే బోర్డులు ఉంచుతారు.


views: 834Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams