Current Affairs Telugu Daily

ఆర్‌టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం

*భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 
*సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనని, అది కూడా పారదర్శకత చట్టమైన ఆర్టీఐ కిందకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 
*ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. 
*పారదర్శకత పేరిట న్యాయవ్యవస్థ స్వతంత్రను తక్కువ చేయలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.న్యాయవ్యవస్థలో పారదర్శకత ఉండాలనీ,స్వతంత్రత, జవాబుదారీతనం చేయి చేయి కలిపి నడవాలని ధర్మాసనం పేర్కొంది. గోప్యతకు, జవాబుదారీ తనానికి మధ్య సమతుల్యత ఉండాలని పేర్కొంది. 
*సీజేఐ కార్యాలయం కూడా ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
* చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం  ఈ పిటిషన్లపై విచారణ జరిపి..ఈ ఏడాది ఏప్రిల్‌ 4న తన తీర్పును రిజర్వులో ఉంచింది.నవంబర్ 13వ తేదీన దీనికి సంబంధించిన తీర్పును వెలువరించింది.
* ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సభ్యులుగా ఉన్నారు.


views: 685



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams