Current Affairs Telugu Daily

ఎకోర్యాప్‌ తన తాజా నివేదిక

*ఆర్థిక మందగమనం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) జీడీపీ వృద్ధి రేటును తగ్గించనుంది .
*కీలక రంగాల్లో పెట్టుబడులు, డిమాండ్‌, వృద్ధి రేటు మందగించడంతో 2019-20లో జీడీపీ వృద్ధి రేటు అయిదు శాతం మించక పోవచ్చని ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధనా విభాగానికి చెందిన ‘ఎకోర్యాప్‌’ తన తాజా నివేదికలో పేర్కొంది.
* ఈ సంవత్సరానికి ఆర్‌బీఐ అంచనా వేసిన 6.1 శాతానికన్నా ఇది తక్కువ. 
*ఎస్‌బీఐ ఎకోర్యాప్‌ కూడా ఇంతకు ముందు ఒక నివేదికలో 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది.
*ఈ నివేదిక ప్రకారం,రెండో త్రైమాసిక వృద్ధి రేటు 4.2 శాతం మించదు. 
* తొలి త్రైమాసికంలో నమోదైన అయిదు శాతంతో పోలిస్తే ఇది 0.8 శాతం తక్కువ. ఆటోమొబైల్‌ అమ్మకాలు క్షీణించడం, విమాన ప్రయాణాలు తగ్గడం, నిర్మాణ, మౌలిక రంగాల్లో పెట్టుబడులు క్షీణించడం, కీలక రంగాలు పడకేయడం రెండో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీశాయి.
*ఎస్‌బీఐ ఎకోర్యాప్‌ అంచనా ప్రకారం,డిసెంబరు 5న జరిగే ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటును భారీగా తగ్గించే అవకాశం ఉంది. గత నెలలో సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పావుశాతం తగ్గించింది.2019లో ఇప్పటి వరకు వడ్డీరేట్లను ఐదు సార్లు తగ్గించిన ఆర్బీఐ..వృద్ధిరేటు అంచనాను కూడా 6.9 శాతం నుంచి 6.1 శాతానికి కుదించింది.
*వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) భారత జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. 
*ప్రపంచ దేశాల ఆర్థిక అనిశ్చిత ఇండెక్స్‌లో భారత ర్యాంక్ చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. 
*. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గడిచిన రెండు నెలలుగా రూ.70.5 నుంచి రూ.71.5 మధ్యలో ఉంటూ వస్తోంది. 


views: 602



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams