Current Affairs Telugu Daily

న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం లో నీతా అంబానీ కి చోటు 

రిలయన్స్ ఇండస్ట్రీస్  చైర్మన్ ముకేశ్‌ అంబానీ భార్య, దాత నీతా అంబానీ (57) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
*ఈమె దేశ కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
*న్యూయార్క్‌లో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం బోర్డులో స్థానం దక్కించుకున్నారు. యూఎస్ ఆర్ట్ మ్యూజియానికి (మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్) నీతా అంబానీ పేరు పెట్టారు.ప్రపంచవ్యాప్తంగా 5వేల ఏళ్ల నాటి నుంచి ఉన్న కళాఖండాలు మ్యూజియంలో ఉంటాయి.
*మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ చైర్మన్ డేనియల్ బ్రోడ్స్‌స్కీ ప్రకటన- ప్రపంచం నలుమూలల నుండి కళను అధ్యయనం చేసి, ప్రదర్శించే మ్యూజియం సామర్థ్యానికి నీతా అంబానీ మద్దతు భారీ ప్రయోజనాన్నిచేకూర్చింది.
*నీతా అంబానీని మ్యూజియం గౌరవ ధర్మకర్తగా ఎంపి‍క చేసినట్టు తెలిపారు.
* అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో పనిచేసిన మొదటి భారతీయ మహిళగా ఖ్యాతి గడించిన నీతా క్రీడల రంగంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి భారత రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహాన్ అవార్డును అందుకున్నారు.(2017లో) 
*ఆసియాలో అత్యంత శక్తివంతమైన 50 మంది వ్యాపారవేత్తల  ఫోర్బ్స్‌ జాబితాలో ఒకరిగా నిలిచారు.
*రిలయన్స్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ రిలయన్స్‌ ఫౌండేషన్‌  ఛైర్మన్‌గా ఉన్న నీతా అంబానీ దేశీయంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యం, సంస్కృతి,కళలు, క్రీడాభివృద్ధికోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
*న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ లో ప్ర‌తి ఏడాది ఆమె షోలను నిర్వహిస్తున్నారు.
*149 సంవత్సరాల పురాతనమైన లాభాపేక్షలేని, మెట్రోపాలిటన్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా 5,000 సంవత్సరాల నుండి విస్తరించి ఉన్న కళలను ప్రదర్శిస్తుంది.
*2017 అక్టోబర్ 11 నుంచి 2018 జనవరి 2 వరకు 'మొడర్నిజం ఆన్ ది గంగాస్: రఘుబీర్ సింగ్ ఫోటోగ్రాఫ్స్' ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు కృషి చేసింది రిలయెన్స్ ఫౌండేషన్. ఆ తర్వాత 2019 జూన్ 4 నుంచి సెప్టెంబర్ 29న వరకు 'ఫినామినల్ నేచర్: మృణాళిని ముఖర్జీ' ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇక 2020 నవంబర్ 10న 'ట్రీ అండ్ సెర్పెంట్: ఎర్లీ బుద్ధిస్ట్ ఆర్ట్ ఇన్ ఇండియా 200 బీసీ-ఏడీ 400' ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌ ఇంటర్నేషనల్ కౌన్సిల్‌లో నీతా అంబానీ సభ్యురాలు కూడా. 
* భారతదేశానికి చెందిన సాంస్కృతిక దిగ్గజాల గొప్పదనాన్ని ఈ తరానికి తెలిపేందుకు ది ఎలిఫాంటా ఫెస్టివల్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కాన్సర్ట్ లాంటి కార్యక్రమాల నిర్వహణకు రిలయెన్స్ ఫౌండేషన్ స్పాన్సర్‌గా నిలిచింది.


views: 672



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams